యోగ, ఆరోగ్యము,వ్యక్తిత్వ వికాసం పై శిక్షణ.
![]() |
| యోగా తరగతులకు హాజరైన దేవాపూర్ వాసులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కాలనీలోని లేడీస్ క్లబ్ లో ఓరి ఏంటి యాజమాన్యం సహకారంతో సత్యసాయి మండల్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తరగతులను నిర్వహించారు. యోగా గురువు రంజిత్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా తరగతులకు హాజరైన వారందరికీ ధ్యాన యోగ శిక్షణ తో పాటు వ్యక్తిత్వ వికాసం జీవితం పట్ల అవగాహన ఆరోగ్యంపై శ్రద్ధ అనే విషయాలపై గత వారం రోజులుగా మంచి అవగాహన కల్పించారు. సోమవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో ఓరియంట్ యాజమాన్యం నుండి యోగా గురూజీ రంజిత్ కుమార్ కు బహుమతి తో పాటు సన్మానించారు. తరగతులకు దేవాపూర్ పరిసర గ్రామాల నుండి సుమారు 50 మంది మహిళలు, పురుషులు పిల్లలు హాజరయ్యారు.

