అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బన్న లక్ష్మన్ దాస్ కు కాసిపేట ఉద్యోగుల సన్మానం.
![]() |
| అంబేద్కర్ జాతి అవార్డు గ్రహీత బన్న లక్ష్మణ్ దాస్ ను సన్మానిస్తున్న గని మేనేజర్ భూ శంకరయ్య, యూనియన్ నాయకులు. |
Scv News Kasipet:--
డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బన్న లక్ష్మన్ దాస్ కు ఈరోజు మందమర్రి ఏరియా కాసిపేట గని ఉద్యోగులు అధికారులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.
గని మేనేజర్ భూశంకరయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్,ఫిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ, INTUC సెంట్రల్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెళ్లి సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్యలు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా దాగం మల్లేష్ మాట్లాడుతూ బన్న లక్ష్మందాస్ సామాజిక కార్యకర్తగా, విద్యాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ అంశాలపై కృషి చేసినందుకు గాను సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డ్ కు ఎంపికచేయడం జరిగిందన్నారు. సింగరేణి ఉద్యోగం చేస్తూనే గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకు ఆర్థికంగా సహకారాన్ని అందించారు. ఉచితంగా పుస్తకాల పంపిణీ, మొక్కలను నాటడం తోపాటు అనేక సామాజిక అంశాలపై పనిచేయడం మొదటి నుంచి అలవాటు చేసుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మిట్ట సూర్యనారాయణ, వెంకట స్వామి, రాపర్తి శ్రీనివాస్, రవీందర్,బాపు, కన్నయ్య,TBGKS ఏరియా కార్యదర్శి ఓడ్నాల రాజన్న, దూట శ్రీనివాస్, సోల్లంకి శ్రీనివాస్,బైరి శంకర్,బాణోత్ తిరుపతి,తోకల రమేష్,దుర్గం శ్రీనివాస్, రమేష్, భిక్షపతి,AITUC నాయకులు నాగేశ్వరరావు, రాజేందర్,లింగన్న, సురేష్,అశోక్, జాడి శంకర్,SC/ST అసోసియేషన్ నాయకులు కనుకుల తిరుపతి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, సెక్రెటరీ కృష్ణ,భువన చంద్ర, మైఖేల్, సత్యనారాయణ, లింగ స్వామి,బాను బాబు,CITU నాయకులు శ్రీధర్, చేయూత స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు అదెపు రవీందర్, అంకం రాజమల్లు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు, డిప్యూటీ మేనేజర్ నిఖిల్, అండర్ మేనేజర్ వంశీకృష్ణ, వెంకటేష్, సుమన్,సంక్షేమ అధికారి మీర్జా,ఉద్యోగులు పాల్గొని సన్మానించారు.

