సామాజిక ఉద్యమకారుడు లక్ష్మణ్ దాస్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు ఇవ్వడం మా సంస్థకు గర్వకారణం.
- బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ.
![]() |
| బండ లక్ష్మణ్ దాస్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు మెమొంటోను అందజేస్తున్న బి ఎస్ ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ. |
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త,స్వేరోస్ రాష్ట్ర నాయకులు, సింగరేణి ఉద్యోగి బన్న లక్ష్మన్ దాస్ 25.06.2024 మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ(BSA) వారిచే అంబేద్కర్ జాతీయ అవార్డు ను బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
అంబెడ్కర్ జాతీయ అవార్డు సత్కరించిన సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ బన్న లక్ష్మన్ దాస్ పని చేసిన ప్రతి పని లో ఫలితం తీసుకురావడంలో నేర్పరి అని,ఏ సంస్థ లో చేసిన ప్రజల కు దగ్గరగా ఉండీ కష్టపడి చేయగలరని, అంబేద్కర్ నేషనల్ అవార్డు తెలంగాణ నుండి తీసుకోవడం ఆనందించదగినదని అన్నారు. 2002 లో సా స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల్లో విద్యా వ్యాప్తి,వైద్య ఆరోగ్య, పర్యావరణ అంశాలపై కృషి చేయడం గొప్పదని కొనియాడారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బన్న లక్ష్మన్ దాస్ మాట్లాడుతూ స్వేరోస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ ఐనాల సైదులు,సర్పంచ్ తిరుపతి గారితో కలసి "ఈచ్ వన్ టీచ్ టెన్" కార్యక్రమం మంచి ఫలితాలను అందించిందన్నారు. మంచిర్యాల NTR నగర్ లో విద్యార్థులు, పేరెంట్స్, ప్రిన్సిపాల్ రమణ కుమార్,జన్నారం ఇందన్ పల్లి లో జాడి మురళి గారితో కలసి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అప్పటి RV కర్ణన్,DEO రమాకాంత్ రావ్, వయోజన విద్యా సంచాలకులు పూరుషోత్తం నాయక్ గారి సలహాలతో 100 శాతం అక్షరాస్యతను సాధించడం జరిగిందన్నారు. స్వేరో హరితహారం లక్షటి పేటలో Dy. FRO అబ్దుల్ అజార్ తో కలసి మొక్కలను పెంచడం, చెట్లు ఉపయోగం కోసం అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ,సామాజిక అంశాలపై మొదటి నుండి పని చేయడం వల్ల నే అవార్డు వచ్చిందని అన్నారు.
అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,కవి, గాయకులు,రచయిత,కాంగ్రెస్ నాయకులు దరువు ఎల్లన్న ,కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, OU JAC కన్వీనర్ దుర్గం భాస్కర్,AITUC బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, మాజీ ఎంపిటిసి బన్న స్వరూప కుటుంబ సభ్యులు, యోగ శిక్షకులు, బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కార్యదర్శి బాదే వెంకటేష్ పాల్గొన్నారు. సింగరేణి ఉద్యోగి కి అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా దరువు ఎల్లన్న,దుర్గం భాస్కర్, దాగం మల్లేష్ పలువురు అభినందనలు తెలియ చేశారు.

