మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ జాతీయ అవార్డు కు ఎంపికైన సామాజిక కార్యకర్త బన్న లక్ష్మన్ దాస్.

 

 అంబేద్కర్ జాతీయ అవార్డు కు ఎంపికైన సామాజిక కార్యకర్త,బన్న లక్ష్మన్ దాస్ కు పలువురి అభినందనలు.


 అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన బండ లక్ష్మందాస్ నియామక పత్రం అందజేస్తున్న బహుజన సాహిత్య అకాడమీ ఫౌండర్ నల్ల రాధాకృష్ణ


Scv News Kasipet --

మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, స్వేరోస్ రాష్ట్ర నాయకులు,సింగరేణి ఉద్యోగి బన్న లక్ష్మన్ దాస్ కు బహుజన సాహిత్య అకాడమీ వారిచే అంబేద్కర్ జాతీయ అవార్డు కు ఎంపిక చేయడం జరిగింది. అంబెడ్కర్ జాతీయ అవార్డు కు ఎంపికైన బన్న లక్ష్మన్ దాస్ కు హైదరాబాద్ లో నియామక పత్రాలను బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు, అకాడమీ పౌండర్ డాక్టర్ నల్లా రాధ కృష్ణ గారు అందించారు. జూన్ 25 న హైదరాబాద్ లో 7వ జాతీయ సదస్సు లో అవార్డ్ ను ప్రదానం చేయనున్నట్లు వారు తెలియ చేశారు.

విద్యా వ్యాప్తికి,ఈచ్ వన్ టీచ్ టెన్ కార్యక్రమం,హరితహారం,పర్యావరణ పరిరక్షణ,సామాజిక అంశాలపై కృషి చేసినందుకుగాను అవార్డు ను ఇవ్వనున్నట్లు తెలిపారు. 

అవార్డు పొందిన బన్న లక్ష్మన్ దాస్ ని  మాజీ మంత్రివర్యులు, బెల్లంపల్లి శాసన సభ్యులు గడ్డం వినోద్ ,చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి  లక్ష్మన్ దాస్  నిబద్ధత, 

క్రమశిక్షణ తో ఏ పనినైనా సులువుగా చేయగల వారని అవార్డు పొందుతున్నందు కు సంతోషం కలిగించిందని అన్నారు.బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ,బాదే వెంకటేష్,వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు,ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,అభినందనలు తెలిపారు.

సింగరేణి ఉద్యోగి కి అంబేద్కర్ జాతీయ అవార్డు కు ఎంపికైనందుకు అభినందించిన కార్మిక సంఘాల నాయకులు .

కాసిపేట గని లో క్లర్క్ గా విధులు నిర్వహిస్తునే,సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సా స్వచ్చంద సంస్థ పౌండర్,స్వేరోస్ రాష్ట్ర నాయకులు బన్న లక్ష్మన్ దాస్ గారికి అంబేద్కర్ జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా AITUC  రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీత రామయ్య, INTUC క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాంపెళ్లి సమ్మయ్య, AITUC బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్,INTUC వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య,సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్,TBGKS వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్,పిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మినారాయణ, ,ఏరియా కార్యదర్శి ఓడ్నిల రాజన్న,బైరి శంకర్, SC, ST ఎంప్లాయిస్ ఉద్యోగస్తుల సంఘం కార్యదర్శి, డిప్యూటి ప్రధాన కార్యదర్శి అంథోని నాగేశ్వరరావు, కనుకుల తిరుపతి,ST అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ కన్సోత్ తారాచంద్,ST లైజన్ ఆఫీసర్ గుగ్లోట్ బాబు ,బీసీ అసోషియేషన్ నాయకులు కారుకూరి లక్ష్మన్  అభినందనలు తెలిపారు.