గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజారిటీతో గెలిపించాలి.
- ఉపాధి హామీ కూలీలను కోరిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కుమారస్వామి యాదవ్.
![]() |
| ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ముత్యంపల్లి ఉపాధి హామీ కూలీల తో మాట్లాడుతున్న పుర కుమారస్వామి. |
Scv News Kasipet:--
పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఈరోజు ముత్యం పెళ్లి పంచాయతీ లో ని ఉపాధి హామీ కూలీలను యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పుర్ర కుమారస్వామి యాదవ్ కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూ. పెంచుతుందని అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటి తో గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రేషవేణి ఓదెలు, కో ఆప్షన్ సిరాజ్ ఖాన్,,యూత్ ప్రెసిడెంట్ మారం రాజ్ కుమార్, బీసీ సెల్ ప్రెసిడెంట్ స్వామి,మాజీ వార్డు సభ్యులు మంద వెంకటేష్, యూత్ ప్రధాన కార్యదర్శి పంబాల అరవింద్, యూత్ ఉపాధ్యక్షులు బోయిని సాయి కుమార్,మారం సురేష్, పులవేణి పోషన్న, బాకీ నరేష్, బోయిని శ్రీనివాస్,గంగాధరి శ్రీనివాస్,గురువాపూర్ మోహన్, పుట్ట శేఖర్,కోల అనిల్,షారుక్ తదితరులు పాల్గొన్నారు.

