ఆదర్శ జీవితం పుచ్చలపల్లి సుందరయ్యది.
-- సంకే రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి.
![]() |
| భరత్ కాలనీ గ్రౌండ్లో వాకర్స్ క్రీడాకారుల ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. |
Scv News Kasipet:--
కాసిపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ కాలనీ లోని సోమ గూడెం గ్రౌండ్ వాకర్స్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఆదర్శ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి వాకర్సు క్రీడాకారులు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ
తెలంగాణలో సాగిన పెట్టించాకిరి, రాజకార్ల ఆగడాలు,నియంతృత్వ నీజాం ప్రభుత్వం పాలనపై జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, ప్రజల తరుపున పోరాటం చేసిన గొప్ప నాయకుడు సుందరయ్యని కొనియాడారు . ప్రజాక్షేత్రంలో ఉన్న గ్రామ వార్డు సభ్యుడి నుంచి MLA,MP, ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రి వరకు ఉన్న ప్రతిఒక్క ప్రజా ప్రతినిధి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్నారు.
MLA,MP గా,ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సుందరయ్య ఎలా బాధ్యతలు నిర్వహిస్తు,ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి ఎట్లా పరిష్కారం చేయించాడో నేటి తరానికి మార్గదర్శిగా తన చరిత్ర కన్పిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్, క్రీడాకారులు భైరగొనిసిద్దయ్య,అజ్మీరా శ్రీనివాస్,బొగేపోశం,S,శ్రీనివాస్,
సదానందం,రాజలింగు,
చిలుముల శ్రీనివాస్,చెన్నురి శ్రీనివాస్, కౌశిక్,వర్షిత్,ప్రేమ్ కుమార్,అనిల్ కుమార్,సాయి తేజ,చరణ్,మరియు వాకర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.
