మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంటు ఎన్నికలు.

 కాసిపేట మండలంలో  ప్రశాంతంగా ముగిసిన పార్లమెంటు ఎన్నికలు.


 కాసిపేట మండలంలో ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు ధర్మారావుపేట దేవాపూర్ గ్రామాలను సందర్శించిన  మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని ఆందోళనకు దిగిన వరిపేట గ్రామస్తులు.

Scv News Kasipet:--

 పార్లమెంటు ఎన్నికలు కాసిపేట మండలంలో ని వివిధ పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా ముగిసాయి. గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల హడావిడి లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.  మండలంలోని వివిధ గ్రామాల్లో ఓటింగ్ సరళిని  మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధర్మారావుపేట కాసిపేట దేవాపూర్ గ్రామాలను సందర్శించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు.  కోమటి చేను పంచాయతీ పరిధిలోని వరి పేట గ్రామ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల సమయం లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని  కొద్దిసేపు ఆందోళనకు దిగారు. అధికారులు సర్ది చెప్పడంతో ఓటింగ్ లో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో స్థానిక కాంగ్రెస్,తెరాస నాయకులు తమ తమ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఓట్ల కోసం మందు విందులు రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడం పట్ల ఓటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.