మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కోమటి చేను లో సత్యసాయి దేవాలయం వార్షికోత్సవం

 ఘనంగా సత్యసాయి

దేవాలయం 9 వ

వార్షికోత్సవం.





Scv News Kasipet:--

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటి చేను గ్రామంలో శ్రీ సత్య సాయి భజన మండలి కోమటి చేను కొండాపూర్ యాప దేవాపూర్ సమితి ఆధ్వర్యంలో  శ్రీరామ సాయి మందిరం 9వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీ సత్యసాయి మహా గాయత్రి హోమం నిర్వహించారు. హుస్నాబాద్ కు చెందిన వైశ్య కుటుంబాలకు చెందిన   సాయి భక్తులు పూజలకు సంబంధించిన సామాగ్రి తో పాటు 34 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవలను మారుమూల పేద ప్రజలకు అందాలని, ఆలయాలను కూడా ఏర్పాటు చేయాలని బాబా ఆశీస్సులతో ఇంతదూరం వచ్చా మని అన్నారు. ఆలయ నిర్వాహ కుడు రాజలింగు మాట్లాడుతూ సత్యసాయి భక్తుల సహకారంతోనే  ఆలయ నిర్వహణ చేయడం జరుగుతుందని అన్నారు. దేవాపూర్, మందమర్రి బెల్లంపల్లి మంచిర్యాల పట్టణాలకు చెందిన  చెందిన సాయి భక్తులు ఆలయ ఏర్పాటుకు నిర్వహణకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారని మండల వాసులు కూడా సహకరించాలని కోరారు. హుస్నాబాద్ నుండి మారుమూల గ్రామమైన కోమటి చేను గ్రామానికి వచ్చి సహాయ సహకారాలు అందించి పేదలకు చీరలు పంచిన సాయి భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


బుల్ బుల్ సితార వాద్యకారుడు చుంచు  గురువయ్య మాట్లాడుతూ కోమటి చేను గ్రామంలోని సాయి మందిరం ఏర్పాటు సమయంలో నిరంతరాయంగా 12 గంటలు బుల్ బుల్ సితార మ్యూజిక్ ను అందించడం జరిగిందన్నారు. సత్య సాయి బాబా ఆశీస్సులతోనే కార్యక్రమం చేయడం జరిగిందని దేవాలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించానని అన్నారు.


సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ సమాజంలో మనుషులు సక్రమమైన జీవనం సాగించాలంటే ఆధ్యాత్మికత, భక్తి భావాలు ఎంతో అవసరమని అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా సందేశాలు, సమాజంలో ఎంతో మందికి ఉపయోగ పడ్డాయి అన్నారు. సత్య సాయి సేవా కార్యక్రమాల వల్ల ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు . కోమటి చేనులోని సత్యసాయి మందిరాన్ని రాజలింగం దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో  నిర్వహించడం అభినంద నీయమని కొనియాడారు.



పూజా కార్యక్రమం అనంతరం సాయి ప్రార్థన చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మందమర్రి దేవాపూర్ చెందిన సాయి భక్తులతో పాటు సామాజిక చైతన్య వేదిక మండల అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపులు పాల్గొన్నారు.