కాసిపేట మండలంలో ఘనంగా 138వ మే డే దినోత్సవం.

దేవాపూర్ పారిశుద్ధ కార్మికుల ఆధ్వర్యంలో మేడే దినోత్సవం.
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో 1038వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను వివిధ పార్టీలు కార్మిక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. కాసిపేట మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా భవన కార్మిక సంఘం నాయకుడు జాడి పోశం, మండల సిపిఐ కార్యదర్శి దాగం మల్లేష్ ఎర్రజెండాను ఎగరవేశారు. కాసిపేట, కాసిపేట టు గనులపై ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, సిఐటి యు ల ఆధ్వర్యంలో ఆయా ఫిట్ సెక్రెటరీ కార్మికుల సమక్షంలో ఎర్రజెండాలను ఎగురవేశారు.
దేవాపూర్ లో....
ఓరియంట్ గేట్ ముందు సిపిఐ మండల కార్యదర్శి సర్వేశం, సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగరేశారు. దేవాపూర్ పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో వారి అనుబంధ సంస్థ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది నాయకుడు నారాయణ ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే కార్మికుల కు హక్కులు లేకుండా బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. మేడే సందర్భంగా కార్మికులు మేల్కొని వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని కోరారు. మండల కాంగ్రెస్ నాయకుడు మేరుగు శంకర్ మాట్లాడుతూ ఎంతోమంది కార్మికుల త్యాగ ఫలితంగా కార్మిక దినోత్సవం మే డే వచ్చిందని కార్మికులు మే డే రోజు అమరవీరులను స్మరించుకునేందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినం కోసం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం నుండే ఎర్ర జెండా పుట్టుకొచ్చింద ని చికాగో అమరవీరుల పోరాటాన్ని వివరించారు. నాయక్ పోడు సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తట్ర భీమ్రావు మాట్లాడుతూ కార్మిక పోరాటాల నుండి పుట్టిన ఎర్రజెండా ను కార్మిక వర్గం విస్మరించవద్దని మేడే ఉత్సవంలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్య ఎర్ర జెండా ఆవిష్కరణ, చికాగో అమరవీరుల గురించి మాట్లాడి అరుణ పతాకమా.. గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బ్రహ్మయ్య, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, పారిశుద్ధ కార్మిక సంఘ సభ్యులు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

