మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోమగూడెం గ్రౌండ్ లో కారల్ మార్క్స్ 203 వ జయంతి.

 


పేదరికానికి,నిరుద్యోగానికి మూలం పాలకుల దోఫీడే కారణం.

 - సంకె  రవి  సిపిఎం  మంచిర్యాల  జిల్లా కార్యదర్శి 

 సోమ గూడెం గ్రౌండ్లో కారల్ మార్క్స్ జయంతి జరుపుతున్న వాకర్స్ అసోసియేషన్.

 Scv News Kasipet:--

కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమ గూడెం గ్రౌండ్లో  వాకర్ అసోసియేషన్, క్రీడాకారుల ఆధ్వర్యంలో ఈరోజు కారల్ మార్క్స్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా  సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ నేడు ప్రజలేదుర్కొంటున్న ప్రతి సమస్యకు బుర్జవా పాలకుల తప్పుడు విధానాలు,దోఫిడే కారణమని మార్క్స్ 180 సం.రాల క్రితమే ప్రపంచానికి  చెప్పడం జరిగిందన్నారు.దోఫీడి కొనసాగినన్ని రోజులు పేదరికం, నిరుద్యోగం,ప్రభుత్వ సంపద లూటీ,ప్రశ్నించేవారిని బెదిరించడం, నిర్బందించడం,మత ఘర్షణలు పెట్టడం,ఒక దేశం,ఇంకొక దేశంపై దాడి చెయ్యడం మనుషులను చంపడం కొనసాగుతుందని మార్క్స్  చెప్పడం జరిగిందన్నారు.ఈ విధానాన్ని కష్ట జీవుల పోరాటాల ద్వారా త్రిప్పి కొట్టుతు దోఫిడీ లేని సోషలిస్టు రాజ్యాన్ని సాదించుకోవడే అన్ని సమస్యల పరిష్కారానికి మార్గమని ప్రపంచానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు.ఈ పిలునందుకున్న కార్మికులు,పేదలు లెనిన్ నాయకత్వం లో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సాధించుకోడం జరిగింది.ఆ తర్వాత చైనా,క్యూబా,వియత్నాం లాంటి దేశాల్లో ప్రజలు పోరాటాలు చేసి కమ్యూనిస్టు రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.నేడు భారత దేశంలోని కేంద్రంలోని పాలకులు అనుసరిస్తున్న దోఫిడి విధానాలను త్రిప్పి కొట్టాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.

  ఈ కార్యక్రమంలో 

సీనియర్ క్రీడాకారులు  బైరగోని సిద్దయ్య, మద్దెల భానేష్, బోగే పొషం,అజ్మీరా శ్రీనివాస్,S,శ్రీనివాస్,ప్రభుదాసు,

కిరణ్,రమేష్,M.అంజయ్య,రాంచందర్, వాకర్స్,క్రీడాకారులు పాల్గొన్నారు.