స్వంత గూటికి ప్రవీణ్ బాబు,అనంత రావు చేరిక.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు.
![]() |
| కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తెరాస నాయకులు ప్రవీణ్ రావు అనంతరావు. |
కాసిపేట మండలం దేవాపూర్ కు చెందిన తెరాస నాయకులు మాజీ సర్పంచ్ భర్త అనంతరావు, తెరాస నాయకుడు ప్రవీణ్ రావు ఈరోజు కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగినది. వీరికి మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లో కి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ధర్మరావుపేట ఎంపిటిసి పార్వతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
