సోనాపూర్ పంచాయతీ ఆదివాసుల మన్ననలు పొందిన బాదు పటేల్ పేరిట బాధు గూడెం ఏర్పాటు.
![]() |
| అనారోగ్యంతో మృతి చెందిన సోనాపూర్ గిరిజన నేత కనక బాదు పటేల్. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం సోనాపూర్ పంచాయతీలో ని గిరిజన నేత కనక బాదు పటేల్ (65)అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. గత కొద్ది కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కనక బాదు గత 40 ఏళ్లుగా సోనాపూర్ పరిధిలోని 15 గిరిజన గూడాలలో పటేల్ గా వ్యవహరిస్తూ వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన గిరిజన నేత. గిరిజనుల తరపున ప్రభుత్వ అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి సోనాపూర్ పంచాయతీలో వివిధ గ్రామాల భూ సమస్యలు రహదారులు, చెరువుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. ఆదివాసి నాయకుడిగా గుర్తింపు పొందిన బాదు పేరిట సోనాపూర్ పంచాయతీలో 15 ఏళ్ల క్రితం బాదుగుడెం ఏర్పాటయింది. సోనాపూర్ చెరువు నీరు పంట పొలాలకు చేరక నిరుపయోగంగా ఉంటే ఆయకట్టు రైతులతో ఉద్యమించి బాదు గూడెం, నాయకపు గూడెం గ్రామాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ఎంతో కృషి చేశాడు. గిరిజన నేత కనకబాదు మృతి సోనాపూర్ పంచాయతీ లోని గిరిజన గూడాలకు తీవ్రని లోటు.
కనక బాదు మృతి గిరిజన గూడా లకు ఎంతో లోటని ఆదివాసి నాయక్ పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, వివిధ గిరిజన సంఘాల నాయకులు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది.
