మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో మహిళా పోలింగ్ స్టేషన్ కు ప్రత్యేక అలంకరణ

 బొట్టు పెట్టి హారతి పట్టి పూలతో ఎలక్షన్ సిబ్బందికి స్వాగతం

 దేవాపూర్ మహిళా పోలింగ్ స్టేషన్ కు వస్తున్న సిబ్బందికి స్వాగతం పలుకుతున్న పంచాయతీ సిబ్బంది.

Scv News Kasipet:--

కాసిపేట మండలం దేవాపూర్ లోని 13వ పోలింగ్ స్టేషన్ మహిళా పోలింగ్ స్టేషన్ గా ప్రకటించి ప్రత్యేక అలంకరణ చేశారు . ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలోని పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు.

బొట్టు పెట్టి హారతులు ఇచ్చి పూల బొకేలతో ప్రత్యేక స్వాగతం పలికి సిబ్బందిని సంతోషపెట్టారు. దింసా నృత్యం, సన్నాయి మేళ తాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సిబ్బంది దేవాపూర్ లోని పోలింగ్ స్టేషన్లో అన్నింటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేల తాళాలు తో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలకడంతో పాటు వారికి షర్బత్ అందించి ఉత్తమ పోలింగ్ నిర్వహించవలసిందిగా ఆహ్వానం పలికారు. చక్కటి ఏర్పాట్లను చూసిన పోలింగ్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దేవాపూర్ రెండవ సెక్టార్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ లలో సౌకర్యాలు చాలా చక్కగా ఏర్పాటు చేయడం పట్ల సెక్టార్ ఆఫీసర్ ఐనాల సైదులు సంతృప్తి వ్యక్తం చేశారు.