మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా దేవాపూర్ లో వైశాఖ బుద్ధ జయంతి కార్యక్రమం

ఘనంగా  దేవాపూర్ లో వైశాఖ బుద్ధ జయంతి కార్యక్రమం.

-- బుద్దుడి బోధనలు పాటిస్తే కుటుంబాల్లో ఆనందం.


 దేవాపూర్ అంబేద్కర్ భవన్లో బుద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు.


Scv News Kasipet :--

కాసిపేట మండలం దేవాపూర్ అంబేద్కర్  భవన్ లో బుద్ధుడి 2566 వైశాఖ బుద్ధ జయంతి ఉత్సవం అంబేద్కర్ యువజన సంఘం, బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, m 21 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల నాయకులు బుద్ధుడి విగ్రహం ముందు పూలు సమర్పించారు. బుద్దిస్ట్ సొసైటీ మహిళా అధ్యక్షురాలు రజనీ పాలేకర్ ఆధ్వర్యంలో  బుద్ధ వందనం చేశారు. 

ఈ సందర్భంగా బిఎస్ఐ మండల ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు పంచశీల, అష్టాంగ మార్గాలు పాటించడం వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని అన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారులు చిన్న భీమయ్య మాట్లాడుతూ బుద్ధుడు జీవితం అందరికీ ఆదర్శప్రాయమ ని నిత్యజీవితంలో అందరం బుద్ధుడి బోధనలు పాటించాలి అన్నారు. 

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు మిగతా మతల ప్రవక్తల మాదిరిగా తాను మానవ అతీత శక్తిని మోక్ష దాతను కాదని  నేను మామూలు మనిషి నేనని మార్గదర్శినే తప్ప మోక్షదాతను కాదని  ప్రకటించిన మహనీయుడని అన్నారు. ప్రపంచంలో మొట్టమొదట మనిషిని నడిపించేది  ఆత్మ కాదు మనసు అని మనసును ఎప్పుడు తన ఆధీనంలో ఉంచుకుంటే సుఖ సంతోషాలతో జీవించవచ్చని ప్రపంచానికి తెలిపిన మానసిక శాస్త్రవేత్త ని కొనియాడారు. బెల్లంపల్లి m21 ఇంచార్జి కనకయ్య మాట్లాడుతూ బుద్ధుడు మూఢనమ్మకాలు దేవుడు ఆత్మలన్ని బూటకముని ప్రకటించాడన్నారు. ఇవన్నీ ప్రజల శ్రమ శక్తిని దోచుకునేవారు సృష్టించినవని  వీటిని ఎవరు నమ్మవద్దని శాస్త్రీయంగా ఆలోచించాలని సత్యం కరుణా ప్రేమ గురించి బోధించాడన్నారు. ఎం 21 సభ్యుడు గొడిసెల స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి  దేశ ప్రజలకు సత్యం ప్రేమ కరుణ బోధించిన బుద్ధుడు మనువాద వర్గాలకు కుట్రల వల్ల ఈ దేశంలో లేకుండా పోయాడు అన్నారు. ప్రజలంతా ఇప్పుడిప్పుడే బుద్ధుడి గురించి తెలుసుకొని చైతన్యవంతులు అవుతున్నారు అన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం దేవపూర్ అధ్యక్షుడు గసికంటి మల్లేష్  మాట్లాడుతూ బుద్ధుడి ప్రబోధాల వల్ల సమాజంలో ఎంతో చైతన్యవంతమై శాంతి మార్గంలో పయనిచ్చిందన్నారు. అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి రామిల కిష్టయ్య మాట్లాడు తూ బహుజన సమాజమంతా బుద్ధుడి మార్గంలో పయనించి బుద్ధుడి ధర్మాన్ని పాటించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించాడని గుర్తు చేశారు. అంబేద్కర్ వాదులంతా గ్రామాలలో బౌద్ధ న్ని ప్రచారం చేయాలని కోరారు.

బుద్ధుడి జీవిత విశేషాలు, సమాజానికి ఇచ్చిన ప్రబోధాల గురించి ఎం 21 సభ్యులు  సాయి కిరణ్, ఆత్రం మహేష్  తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు ముల్కల రాములు, మహేష్   బెల్లంపల్లి ఎం 21 సభ్యులు కృష్ణ,  రాజన్న ఉమా, విజయ  తదితరులు పాల్గొన్నారు.