దేవాపూర్ లో ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళి.

ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పిస్తున్న తుడుం దెబ్బ నాయక్ పోడ్ సేవ సంఘం నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి రైతాంగ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల 43వ సంస్మరణ సందర్భంగా ఈరోజు నివాళులర్పిం చారు. ఓరియంట్ గేటు ముందు కొమరం భీం విగ్రహం వద్ద తుడుం దెబ్బ,నాయక్ కోడ్ సేవా సంఘం నాయకులు ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరుల పోరాటం గురించి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, ఆడ జంగు, నాయక్ కోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడారు.
ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వెడమ కిషన్ తుడుం దెబ్బ జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేంద్రం హన్మంతు తుడుం దెబ్బ మండల కమిటీ గౌరవ అధ్యక్షులు ఆత్రం జంగు తుడుం దెబ్బ మండల కమిటీ అధ్యక్షులు సండ్ర భూమయ్య నాయకపోడ్ సేవా సంఘం నాయకులు తట్ర భీంరావు రెడ్డి లక్ష్మణ్ ఆదివాసి నాయకులు సోయాం సురు మడావి ధర్మారావు తొడసం సురేష్ సోమని పోశక్క యూత్ నాయకులు సీడం జగన్, పంద్రం విజయ్,కుర్సేగా రవి,సిడం సంతోష, కోవ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
