హిందూ,ముస్లిం మత సామరస్యానికి ప్రతీక.
![]() |
| ఆంజనేయ స్వాములకు బిక్ష వడ్డిస్తున్న ముస్లిం మైనారిటీ నాయకులు. |
![]() |
| స్వాములకు బిక్ష వడ్డిస్తున్న ముస్లిం మైనారిటీ నాయకుడు మూర్తుజ. |
దేశంలో మతోన్మా దులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం హిందూ ముస్లింలలో మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్న ఈ తరుణంలో కాసిపేట మండలంలోని ముత్యం పల్లి గ్రామంలో ముస్లిం మైనారిటీలు, ఆంజనేయ స్వాములకు బిక్షపెట్టడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఆదర్శప్రాయం అవుతుంది.
కాసిపేట మండలం ముత్యం పల్లి, గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ముస్లిం మైనారిటీ మూర్తుజ ఆధ్వర్యంలో ఈరోజు ఆంజనేయ మాల ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. కో ఆప్షన్ సభ్యుడు సిలర్ ఖాన్, ముస్లిం మైనారిటీ నాయకులు రెహమాన్, షారుక్, సోహెల్ ఆంజనేయ స్వాములకు స్వయంగా బిక్షను వడ్డించారు. స్వాములకు ముస్లిం మైనారిటీలు బిక్ష పెట్టడం పట్ల మండల ప్రజలు ముస్లిం మైనారిటీలను అభినందిస్తున్నారు.
మతోన్మాదులు రెచ్చగొట్టే మాటలకు రెచ్చిపోకుండా హిందూ ముస్లింలు మతసామరస్యం తో జీవించాలని పలువురు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, మహేష్, స్వామిలు పాల్గొన్నారు.

