ఇప్పలగూడెంలో పులాజి బాబా ధ్యాన మందిరంలో 13వ వార్షికోత్సవం .
![]() |
| ఇప్పల గూడెం పులాజి బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. |
![]() |
| వార్షికోత్సవంలో మాట్లాడుతున్న నాయకులు. |
Scv News Kasipet --:
కాసిపేట మండల లోని ఘట్రావ్ పెళ్లి పంచాయతీ పరిధిలోగల ఇప్పలగూడెం పులాజి బాబా ధ్యాన మందిరంలో ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులాజి బాబా పీఠం నుండి మహారాజ్ భగవంతు రావు హాజరై పులాజి బాబా ధర్మ సందేశాన్ని భక్తులకు వినిపించారు. ధ్యానం, ఏకాగ్రత, ఆత్మ చింతల గురించి భక్తులకు వివరించారు. ధ్యానం ద్వారా కుండలిని శక్తిని జాగ్రత్త చేసుకోవాలని సూచించారు.
సత్య ధర్మ సంస్థాపకుడు తోటపల్లి భూమన్న మహారాజు మాట్లాడుతూ మనుషులను సక్రమమైన మార్గంలో పయనింప చేసేందుకు మనసును శుద్ధి చేసే ధ్యానమార్గంలో పయనించాలని మహనీయులంతా బోధించారని అన్నారు. బుద్ధుడి నుండి మొదలుకొని సంత్ రవిదాస్,కబీర్, పులాజి బాబా లాంటి మహనీయుల అంతా ధ్యానం గురించి ప్రచారం చేశారు అన్నారు. భౌతిక శరీరంలోని మురికిని ఎలా శుభ్రంగా చేసుకుంటున్నామో మనసును శుభ్రం చేసుకునేందుకు ధ్యానం అంతే అవసరమని అన్నారు. మారుమూల ప్రాంతంలోని గిరిజనులు ధ్యానం మార్గంలో పయనించడం గొప్ప విషయం అని కొనియాడారు.
కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్య, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, సలహాదారు చిన్న భీమయ్యలు మాట్లాడారు. సమావేశానికి పులాజి బాబా భక్తుడు రాయి సిడం రామ్ అధ్యక్షత వహించారు. వార్షికోత్సవ కార్యక్రమంలో యిప్పలగూడెం ధ్యాన మందిరం భక్తులతో పాటు తిర్యాని మండలం గిన్నేదరి పులాజి బాబా మందిర భక్తులు పాల్గొన్నారు. వార్షికోత్సవ ప్రారంభం శనివారం ఇప్పలగూడెం ధ్యాన కేంద్ర బాధ్యులు పంద్రం రాజు ఆధ్వర్యంలో ధ్వజారోహణతో ప్రారంభమైంది. రెండు రోజులు పూజ భజనలతో కార్యక్రమం కొనసాగి హారతి కార్యక్రమంతో ముగిసింది.
కార్యక్రమంలో కనక మానుకువెడమ బాపురావు, మాడావి తిరుపతి,బక్క రాజయ్యకనక రాము,కుడుమెత జంగు భాయ్,సిడం మోతీరామ్ తదితర పాల్గొన్నారు.

