పాఠశాల లో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలపై ఆరా!

మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఏ టి డబ్ల్యూ ఓ గంగారం.
Scv News Kasipet:--
మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈరోజు మంచిర్యాల గిరిజన అభివృద్ధి అధికారి మాడావి గంగరాం , ఏసీఎంఓ శ్రీ.ఎం.రాజమౌళి తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ.అజ్మీరా.నరసింహ ను విద్యార్లులకు అందిస్తున్న సౌకర్యాలపై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.SA-2. పరీక్షల నిర్వహణ ను పరిశీలించారు.పాఠశాల పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్త పరిచారు. వచ్చే విద్యా సంవత్సరం లో ప్రవేశాలకు ముందునుండే సిద్దం కావాలని, గిరిజన సంక్షేమశాఖ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేసి పాఠశాల లో విద్యార్థుల సంఖ్య ను పెంచాలని సూచించారు.