పేదలకు సాయం అందించడమే కొక్కిరాల కుటుంబం లక్ష్యం... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ .
![]() |
| దేవాపూర్ లో ఓరియంట్ కార్మికులకు అంబలి పంపిణీ చేస్తున్న వేముల కృష్ణ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని దేవాపూర్ కేంద్రంలో గత 12 రోజులుగా కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్ధకంగా ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ చే 13 వ రోజు ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భం గా వేముల కృష్ణ మాట్లాడుతూ కొక్కిరాల రఘుపతిరావు కుటుంబం పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ఈ ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో ధర్మారావు పేట ఎంపీటీసీ పార్వతి మల్లేష్ , దేవాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

