కాసిపేట మండలంలో ఘనంగా శ్రీరామనవమి దినోత్సవం.
![]() |
![]() |
| కాసిపేట మండలంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. |
Scv News Kasipet:---
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లోని వివిధ గ్రామాలలో శ్రీరామనవమి దినోత్సవం ఘనంగా నిర్వహించు కున్నారు. కాసిపేట దుబ్బగూడం, కోమటిచేను, రేగులాగూడెం, ధర్మారావుపేట సల్ఫల వాగు, దేవాపూర్ లో శ్రీరామనవమి ఉత్సవా లను ఆలయాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
ధర్మారావుపేటలో ఘనంగా సీతారామ కళ్యాణం.
ధర్మ రావు పేట గ్రామంలో మాజీ ఎంపీపీ రఘుపతిరావు, అతని కుమారుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో నిర్మించిన సీతారామ ఆలయంలో వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రఘుపతిరావు చిన్న కుమారుడు సత్యపాల్ రావు దంపతులు సీతారామ కళ్యాణం వేద బ్రాహ్మణులచే చేయించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరయ్యారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, గడ్డంవంశి లు హాజరయ్యా రు. స్థానిక ఎంపీటీసీ పార్వతి మల్లేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ, రత్నం ప్రదీప్, మండల కాంగ్రెస్ నాయకులు ఉత్తూరి సత్తయ్య, రాపర్తి శ్రీనివాస్, సత్యనారాయణ బెల్లంపల్లి మండల కాంగ్రెస్ విజయలక్ష్మి, దీకొండ రాజ లింగు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసారు.
సల్పల వాగులో...
మద్దిమడ పంచాయతీలోని సల్ఫల వాగు ఒడ్డున దేవాపూర్ మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారామ ఆలయంలో సీతా రామ కళ్యాణం ఘనంగా నిర్వహి చారు. దేవాపూర్ గట్రావ్ పెళ్లి మద్ది మాడ సోనాపూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తు న హాజరయ్యా రు. భక్తులకు కల్కి భగవాన్ భక్తులు భగీరథ ఆధ్వర్యంలో అల్పాహారము, చల్లటి మంచినీటిని అందించారు. దేవాపూర్ కు చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
దేవాపూర్ లోని అయ్యప్ప ఆలయంలో, ప్రసన్నాంజనేయ ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహిచారు.కోమటి చేను గ్రామంలో సత్య సాయి బాబా భక్తులు, రేగుల గూడెం లో లక్ష్మారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు.

