ఘనంగా కాసిపేట మండలంలో పూలే జన్మదినోత్సవ కార్యక్రమాలు.
![]() |
| కాసిపేట మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన కార్యక్రమం. |
![]() |
| బహుజన వర్గాల కోసం జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను, జీవిత విశేషాలను వివరిస్తున్న వక్తలు. |
Scv News Kasipet:--
భారతదేశ మొట్టమొదటి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే జన్మ దినోత్సవ కార్యక్రమం కాసిపేట మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో, దేవాపూర్ లో ఆదివాసి నాయక్ కోడ్ సేవా సంఘం, బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా మండల శాఖ ఆధ్వర్యంలో, మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపల్లి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత్ కాలనీలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.
![]() |
| మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేస్తున్న అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జాడిపోషం |
మండల అంబేద్కర్ సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశంలో గత 2000 సంవత్సరాలుగా మనువాద బ్రాహ్మణ వర్గం 85 శాతం ఉన్న బహుజన వర్గాలను మానసిక బానిసలుగా చేసి పాలిస్తున్నాయని అన్నారు. బుద్ధుడి తదనంతరం మహాత్మా పూలే బహుజన వర్గా చైతన్యం కోసం ఎనలేని కృషి చేశాడని కొనియాడారు.
మండల కార్యదర్శి గోడిసెల సురేందర్ మాట్లాడుతూ బహుజన వర్గం అంతా పూలే ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం అంబేద్కర్ సంఘ సహాయ కార్యదర్శి అగ్గి వెంకటస్వామి సలహాదారులు లంక లక్ష్మణ్,రాంఠంకి వాసుదేవ్, బీసీ సెల్ ఇన్చార్జి పెద్దపల్లి శంకర్, కలవల శ్రీనివాస్, మైనార్టీ నాయకులు సిరాజ్ ఖాన్, అంబేద్కర్ సంఘ సభ్యులు రత్నం రాజం, ఇంగు నారాయణ, గొడిసెల క్రాంతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
దేవాపూర్ లో..
![]() |
| మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్న నాయక్ పోడు సేవా సంఘం, బుద్దిస్ట్ సొసైటీ నాయకులు. |
మల్క పెళ్లిలో
![]() |
| జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలు సమర్పిస్తున్న మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు. |
మల్కపెల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపెల్లి యూత్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కపల్లి యూత్ అధ్యక్షుడు వెంకటేష్ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి బద్ది శ్రీనివాస్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి పూలే జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.
భారత్ కాలని లో
![]() |
| మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వాకర్ అసోసియేషన్. |
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ కాలనీ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే చిత్రపటానికి వాకర్స్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంకే రవి, సిద్దయ్య శ్రీనివాస్, రమేష్, పోచం బానే వెంకన్న కిరణ్, రామచందర్ వాకర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.





