మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గట్రావుపల్లె వరకు బస్సు సదుపాయం కల్పించండి.

 ఉపాధి హామీ కూలీలు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదివాసి సేన నాయకుల పిలుపు.


Scv News Kasipet:--

 మంచిర్యాల నుండి గట్రావుపల్లె వరకు ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలని  ఆదివాసి సేన నాయకులు అధికారులను కోరారు. మంచిర్యాల,బెల్లంపల్లి, దూరపు ప్రయాణప్రాంతాలకు ఆదివాసి గూడాల ప్రజలు వెళ్లాలంటే  ఎండాకాలం లో చాలా ఇబ్బందిగా  మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మొట్టమొదటి హామీ అయినా  ఆదివాసీ గ్రామాలకు బస్సు సదుపాయం ఇప్పటికీ కల్పించలేదని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే  గట్రావుపల్లి బస్సును యదావిధిగా కల్పించాలని వేసవికాలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. కూలీలు ఎండాకాలం లో ఎండలు చాలా ఎక్కువ ఆయినపుడు తీవ్ర వడగాల్పులు విచినపుడు వడ దెబ్బలు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉపాధి పనులకు గాను ఉదయం పూట వెళ్ళి తొందరగా ఇంటికి చేరుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. తప్పనిసరి వెళ్లవలసి వస్తే తలకు టోపీ ఉండాలి బైకు పై వెళితే హెల్మెట్ ధరించాలి. ఎండను తట్టుకునే తేలని వస్త్రాలు ధరించాలి. నీరు మరియు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని ప్రకటనలో  కాసిపేట మండల ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి   సిడం గణపతి, ఉపాధ్యక్షులు పెందుర్ ప్రభాకర్, సలహాదారులు ఉయికా మోతిరామ్,ఆడే తిరుపతి సూచించారు.