మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాలేజ్ అఫ్ ఎక్సలెన్స్ లో సీట్ సాధించిన మల్కేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి.

 ఆశ్రమ పాఠశాల విద్యార్థి పవన్ కుమార్ కు అభినందనలు.

 

 కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో సీట్ సాధించిన  ఆశ్రమ పాఠశాల విద్యార్థి పవన్ కుమార్.
Scv News Kasipet:--

కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పదవ తరగతి  విద్యార్థి పవన్ కుమార్ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో సీట్ సాధించాడు.

గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న అత్యుత్తమ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన  రెండు ఫేస్ ల పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి భద్రాద్రి కొత్తగూడెం కిన్నెరసాని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సీట్ సాధించాడు. ఈ సందర్భంగా అతనిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మీరా నరసింహ , పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థిని అభినందించారు. అలాగే మిగతా విద్యార్థులు పవన్ ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎక్సలెన్స్ కాలేజీ సీట్ సాధించిన పవన్ కుమార్ కు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.