మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా ఆదివాసీ అమరుడు చేనేని భీమయ్య 36 వర్ధంతి కార్యక్రమం.

 ఘనంగా ఆదివాసీ అమరుడు చేనేని భీమయ్య  36 వర్ధంతి కార్యక్రమం.


 ఆదివాసి అమరుడు  చేనేని  భీమయ్యకు నివాళులర్పిస్తున్న గిరిజన సంఘాల నాయకులు.


Scv News Kasipet:--

 మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మద్దిమడ గ్రామంలో ఈరోజు ఆదివాసీ నాయకపొడ్ సేవా సంఘం కాసిపేట మండల కమిటీ అధ్వర్యంలో ఆదివాసి అమరవీరుడు చెనేని బీమయ్య 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసి సేవా సంఘం నాయకులు కుటుంబ సభ్యులు ఉదయం 9.00 గంటలకు మద్దిమడ గ్రామంలో తన విగ్రహము వద్ద ఆదివాసీ నాయకపొడ్ కులస్తుల సాంప్రదాయం ప్రకారం మొదటగా వారియొక్క కుటుంబ సభ్యుల ఇంటి నుండి పూజ సామగ్రిని తీసుకొని తెప్పటిగుళ్లు మరియు పిల్లనా గ్రోవిలతో ఊరేగింపు గా వెళ్లి, పూజలు నిర్వహించి, జెండా ఆవిష్కరణ చేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాసిపేట MPP శ్రీమతి రొడ్డ లక్ష్మి& రమేష్ , స్తానిక మాజీ సర్పంచ్ ఆడ జంగు , ఆదివాసీ నాయకపొడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల భాపన్న , జాయింట్ సెక్రటరీ తట్ల భీమ్ రావ్ , ఆదివాసీ నాయకపొడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంది రాజన్న , మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ , కాసిపేట మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్ , తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్యలు మాట్లాడుతూ కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై, చేనేని భీమయ్య వీర మరణం గురించి మాట్లాడారు. గిరిజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐకమత్యంతో ఉద్యమించడమే మార్గమని ఆదివాసి నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో మండల ఆదివాసి నాయక్ పోడ్ ప్రధాన కార్యదర్శి మెండ్రపు రాజన్న , ఉపాధ్యక్షులు భీమిని మహేందర్ , కార్యదర్శి మంగ శ్రీకాంత్ ,రెడ్డి లక్ష్మణ్ , మండల కాంగ్రెస్ నాయకుడు మెరుగు శంకర్  ఉద్యోగ సంఘం నాయకులు రొడ్డ గోపాల్ ,బద్ది లక్ష్మణ్ , భైర్నేని భీమయ్య , నాయిడి మల్లేష్ , తుడుందెబ్బ నాయకులు కనక రాజు , ఆత్రం జంగు, సామాజిక చైతన్య వేదిక సభ్యులు బోగే పోచన్న తదితరులు పాల్గొన్నారు.

 సమావేశంలో ఆదివాసి నాయకులు పలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వం మొదటగా ఇట్టి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరిరిగింది. కాని దాన్ని కాలక్రమంలో గత ప్రభుత్వాలు నిలిపివేయడం జరిగింది. దాన్ని కొనసాగించాలని, ఏదైతే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి అమరుల వేదిక నుండి ప్రకటన చేసినడో , ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటు ఉద్యమంలో గాయాలైన కుటుంబాలను కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు మరియు ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సభావేదిక గా ఆదివాసీ సంఘాలు తీర్మాణం చేయడం జరిగింది .