నేడు ఆదివాసీ అమరుడు చేనేని భీమయ్య 36 వర్ధంతి కార్యక్రమం.
Scv News Kasipet :--
కాసిపేట మండలం మద్దిమాడ గ్రామంలో ఈరోజు ఆదివాసి అమరవీరుడు చేనేని భీమయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆదివాసి నాయకుడు సేవా సంఘం మండల కమిటీ తెలిపింది. ఉదయం 9.00 గంటలకు మద్దిమడ గ్రామంలో తన విగ్రహము వద్ద ఆదివాసీ నాయకపొడ్ కులస్తుల సాంప్రదాయంప్రకారం మొదటగా వారియొక్క కుటుంబ సభ్యుల నింటినుండి పూజ సామగ్రిని తీసుకొని తెప్పటిగుళ్లు మరియు పిల్లనా గ్రోవిలతో ఊరేగింపు గా వెళ్లి, పూజలు నిర్వహించి, జెండా ఆవిష్కరణ చేసి, నివాళులు అర్పించడం జరుగుతుంది. తరువాత సభ సమావేశం తదనంతరం బోజన కార్యక్రమం ఉంటుంది..... కావున ఈ కార్యక్రమానికి 9 తెగల ఆదివాసీ కులసంఘ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, దళిత సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు మొదలగు వారు అందరూ కూడా తమవిదిగా హాజరై సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది గా ఒక ప్రకటనలో తెలి పారు.
