మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో బి ఎస్ ఐ సభ్యుల సమావేశం.

 బహుజన సమాజాన్ని సంస్కరించేందుకే అంబేద్కర్ BSI ని ఏర్పాటు చేశాడు.

- మంచిర్యాల జిల్లా బిఎస్ఐ అధ్యక్షుడు యుగంధర్ సాయి.

 

 దేవాపూర్ అంబేద్కర్ భవన్లో బిఎస్ఐ కమిటీ సభ్యుల సమావేశం.

Scv News Kasipet:--

బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన సమాజాన్ని సంస్కరించి నీతివంతమైన మార్గంలో పయనింప చేసేందుకు బౌద్ధ మార్గాన్ని ఎంచుకుని   బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశాడని BSI మంచిర్యాల శాఖ అధ్యక్షుడు యుగంధర్ సాయి అన్నారు. బుధవారం సాయంత్రం కాసిపేట మండలం దేవాపూర్  అంబేద్కర్ భవన్ లో బుద్దిస్ట్ సొసైటీ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధిష్ట్ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు జిల్లాలో మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

 ఈ సందర్భంగా బి ఎస్ ఐ  జిల్లా సలహాదారుడు తోటపల్లి భూమన్న మాట్లాడుతూ బహుజన వర్గాలలో  జ్ఞానం లేకుండా బ్రాహ్మణ మనువాద వర్గం  కుట్రపూరితంగా మానసిక బానిసలుగా చేశారని అన్నారు. 85% బహుజన వర్గం దేశంలో పాలనకు దూరంగా ఉండి బానిసలుగా బ్రతుకు తున్నారన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన వర్గాలను చైతన్యవంతం చేసి పాలకులుగా తీర్చిదిద్దేందుకు తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు. బహుజన వర్గాలకు జ్ఞానవంతులయ్యేందుకు  చక్కటి ధర్మాన్నించేందుకే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడన్నారు. బౌద్ధ ధర్మం బహుజన ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ముందుకు తీసుకువెళ్లే మార్గమని అన్నారు. ఈ దేశంలోని మూలవాసులమైన బహుజనుల మంతా మన ప్రాచీన బౌద్ధ ధర్మంలోకి వచ్చి నీతివంతమైన జీవనం సాగించేందుకే బుద్దిస్ట్ సొసైటీ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. 

జిల్లా ప్రచార కార్యదర్శి వేల్పుల ప్రవీణ్ మాట్లాడుతూ అంబేద్కర్ వాదులంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన బుద్ధిస్తూ సొసైటీలో చేరి పని చేయాలని కోరారు. సమావేశానికి బిఎస్ఐ జిల్లా సలహాదారు పల్లె మల్లయ్య అధ్యక్షత వహించారు.

 కాసిపేట మండల బిఎస్ఐ తాత్కాలిక కమిటీ ఎంపిక. 

సమావేశ అనంతరం  కాసిపేట మండల  బుద్ధిష్టి సొసైటీ ఇండియాBsi కాసిపేట మండలం తాత్కాలిక కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల కమిటీ అధ్యక్షులుగా బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులుగా చిప్పకుర్తి బాపు ,ప్రధాన కార్యదర్శిగా రాజు పాలేకర్, ప్రచార కార్యదర్శిగా  కొమ్ముల బాపు,మహిళా కమిటీ అధ్యక్షురాలుగా రజనీ పాలేకర్, ప్రధాన కార్యదర్శిగా ముడిమడుగుల తిరుపతి లను ఎంపిక చేశారు. 

సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ముల్కల ప్రశాంత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అటకపురం రమేష్, బుద్ధిష్టి సొసైటీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.