దళిత ఆశ జ్యోతి మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట అంబేద్కర్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు జాడి పోశం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని భోజపురి జిల్లాలో 2008లో జన్మించాడని పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే దళిత విద్యార్థులకు తాగునీటి కోసం ప్రత్యేక కుండలను పెడితే పగలగొట్టి నిరసన వ్యక్తం చేశా డాన్నారు. దళిత వర్గాల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడని దేశ చరిత్రలో సుదీర్ఘంగా 50 ఏళ్ల పాటు పార్లమెంటేయిన్ గా, 30 ఏళ్ల పాటు మంత్రివర్గంలో రెండేళ్లు ఉప ప్రధానిగా చేసి రికార్డు సృష్టించిన దళిత నాయకుడని కొనియాడారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నా మనువాద బ్రాహ్మణ వర్గాల కుట్రల వల్ల ప్రధాని కాలేక పోయాడన్నా రు.
అంబేద్కర్ సంఘం సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడని జీవితాంతం దళిత ఉద్దరణకు పాటుపడ్డ మహా నాయకుడు అని అన్నారు. అంబేద్కర్ సంఘం ఎస్టీ సెల్ ఇంచార్జి కొమ్ముల బాపు మాట్లాడుతూ బాబుజిగ్జీవన్ రామ్ తన జీవితకాలం మొత్తం దళిత వర్గాల చైతన్యం వారి ఉద్ధరణ కోసం పాటుపడ్డ దళిత నేత అన్నారు. నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తట్ర భీమారావు మాట్లాడుతూ బహుజన వర్గాల చైతన్యం కోసం వారి అభివృద్ధి కోసం పాటుపడ్డ జగ్జీవన్ రామ్ లాంటి దళిత నేత జన్మదినం జరుపుకోవడం గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల సహాయ కార్యదర్శి దుర్గం రామచందర్, సలహాదారులు లంక లక్ష్మణ్, రామ టెంకి వాసుదేవ్, నవనందుల తిరుపతి, మైదాము రమేష్ మైనారిటీ సెల్ నాయకుడు కరీం, సభ్యులు రత్నం బానయ్య తదితరులు పాల్గొన్నారు.

