మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం.

 కాసిపేట మండలంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం.

 కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం.



Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో  బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో దేవాపూర్ లో అంబేద్కర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. కోమటి చేనులో స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు జయంతి కార్యక్రమం నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. కొండాపూర్ యాపలో  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. కాసిపేట ఒకటి రెండు గనులలో  ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు అంబేద్కర్ జయంతి నిర్వహించారు.ముత్యంపల్లి క్రీడా మైదానంలో  స్థానిక పెద్దమనుషులు క్రీడాకారులు అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. సందర్భంగా క్రీడ మైదానానికి అంబేద్కర్ క్రీడా మైదానంగా నామకరణ చేశారు.

కాసిపేట మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం.


కాసిపేట మండల కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంక్షేమ సంఘం మండల కమిటీ అధ్యక్షుడు జాడి పోశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, సింగిల్ విండో చైర్మన్ భుక్య నీల, అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం జాడి పోశం  పంచశీల జెండాను ఎగరవేశారు. అంబేద్కర్ సంక్షేమ సంఘం కోర్ కమిటీ ఇన్చార్జిబన్నా లక్ష్మణ్  దాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల గురించి అంబేద్కర్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు జాడిపోశం, ప్రధాన కార్యదర్శి రామిళ్ళ కిష్టయ్య, సలహాదారులు దాగం మల్లేష్, మద్దినేని చిన్న భీమయ్య, పల్లె మల్లయ్య, లంక లక్ష్మణ్,దాసరి రాజం ఎస్టీ సెల్ ఇంచార్జ్  కొమ్ముల బాపు, దేవపూర్ సంఘం నాయకులు గసికంటి మల్లేష్, కంపెల్లి వెంకటేష్,  కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అగ్గి స్వామి, దుర్గం రామచందర్, గోదారుల శంకర్, దాగం రాజలింగు,రత్నం రాజం, మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, గోలేటి స్వామి, మైదం  రమేష్ ధర్మ సమాజ పార్టీ నాయకుడు గో డిసెల సురేందర్, అంబేద్కర్ సంఘ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 దేవాపూర్ లో...


దేవాపూర్ లో అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు గస్కంటి మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి రామిల కిష్టయ్య, ఎస్టి సెల్ ఇన్చార్జి కొమ్మల బాపు, మద్దిమడ మాజీ సర్పంచ్ ఆడేజెంగు, అంబేద్కర్ సంఘం  మాజీ మండల కార్యదర్శి వడ్లూరు మల్లేష్, కోశాధికారి చిప్పకుర్తి బాపు,కాంపెల్లి  వెంకటేష్, ముల్కల స్వామి, ముల్కల ప్రశాంత్   తదితరులు పాల్గొన్నారు. 

 కోమటి చేనులో...


కోమటి చేను గ్రామంలో  స్థానిక అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామ్ టెంకి వాసుదేవ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, గ్రామ అంబేద్కర్ సంఘ కార్యకర్తలు, మహిళలు  పాల్గొన్నారు.

కొండాపూర్ లో...


కొండాపూర్ యాప చౌరస్తాలో . ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తు డుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హనుమంతు, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, బి ఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, పోడేటి  రాజా గౌడ్, లక్ష్మణ్, నేరెళ్ల రవి కాంగ్రెస్ నాయకులు మహంకాళి, చారి తదితరులు పాల్గొన్నారు.

ముత్యంపల్లి క్రీడా మైదానానికి అంబేద్కర్ క్రీడా మైదానంగా నామకరణ.

 కాసిపేట మండలం  ముత్యం పల్లి  పంచాయతీ పరిధిలోని క్రీడా మైదానంలో రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బిఆర్ అంబేద్కర్  133వ జయంతి ఘనంగా నిర్వంచడం జరిగినది. కాసి పేట ముత్యం పెళ్లి గ్రామాల పెద్దమనుషులు క్రీడాకారు లు ముత్యంపల్లి క్రీడా మైదానం కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానం అని నామకరణ చేశారు. ఈ కార్యక్రమానికి వైస్ ఎంపిపి విక్రమ్ రావు,మాజీ సర్పంచ్ బాదు,మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి,దాసరి శంకర్,నమసాని రాజు,మద్యవెని వేణు,దాగం మల్లేష్,గొడిసెల భీమయ్య,లంక లక్ష్మన్, లక్ష్మణ దాసు,గొలేటి స్వామి,వేల్పుల గంగ,రామిల్ల కిష్టయ్య క్రీడా కారులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు.