మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల వాసి డాక్టర్ బుద్దే ప్రవీణ్ కు రాష్ట్రస్థాయిలో అవార్డు.

 కోనూరు  నివాసి మంచిర్యాల పట్టణ కీళ్ల వైద్య నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ కు అరుదైన గౌరవం.



 హెల్త్ కేర్ ఇన్నోవేషన్ లో తెలంగాణలో పేరు పొందిన డాక్టర్ గా అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్న
 డాక్టర్ బుద్దే ప్రవీణ్.


Scv News Kasipet:-

 కాసిపేట మండలం కోనూరు నివాసి డాక్టర్ బుద్దె ప్రవీణ్ కు వైద్యరంగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత మూడు  సంవత్సరాలు గా డాక్టర్ ప్రవీణ్  కీళ్లు ఎముకల వైద్య నిపుణుడిగా  ప్రవీణ్ హాస్పటల్ పేరిట వైద్యశాలను  నడిపిస్తున్నాడు. ఆస్పత్రిలో జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలకు కీళ్లు, ఎముకల వ్యాధితో బాధపడే ప్రజలకు, ప్రమాదాలకు గురైన వారికి   వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆధార అభిమానాలు పొందుతున్నా డు. సేవా దృక్పథంతో తక్కువ ఖర్చులతో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు.సంవత్సర కాలంగా ప్రజలకు అందిస్తున్న  వైద్య సేవలను జాతీయ వైద్య విభాగం గుర్తించి ఇటీవల బెంగళూరులో జరిగిన హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సమ్మిట్ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన వైద్యుడిగా అవార్డుతో పాటు  ప్రశంస పత్రాన్ని అందజేసింది.

కీళ్ల ఎముకల వ్యాధి తో బాధపడే గ్రామీణ ప్రాంత ప్రజలకు, ప్రమాదాలలో గాయపడ్డ వారికి తక్కువ చార్జీలతో  మెరుగైన సేవలందిస్తూ న్న కోనూరు నివాసి బుద్దే రాజయ్య కుమారుడైన డాక్టర్ ప్రవీణ్  కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం కోనూరు వాసులకు కాసిపేట మండలానికి ఎంతో గర్వ కారణం.  గత మూడు సంవత్సరా లుగా బుద్దే ప్రవీణ్ సామాజిక బాధ్యతగా వైద్య సేవలతో పాటు పేదల కూడా  సొంత  ఖర్చులతో సేవా కార్యక్రమాలను అందిస్తున్నాడు.

 తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ  వైద్య నిపుణుడిగా  అవార్డు పొందిన డాక్టర్ బుద్ధె ప్రవీణ్ కు కాసిపేట మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ,ప్రజాసంఘాల నాయకులు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.