కాసిపేట మండలంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి కార్యక్రమాలు.
![]() |
| సావిత్రిబాయి విగ్రహానికి పూలమాల వేస్తున్న నాగపూర్ సేవా సంఘం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. |
Scv News Kasipet:--
భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి కార్యక్రమం వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నిర్వహించారు.
దేవాపూర్ నాయకపు గూడెంలో...
కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధి లో ఆదివాసి నాయక పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో నాయక పుగూడ పాఠశాల ఆవరణలో గల భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల మహిళలకు విద్య అందించడం కోసం అగ్రవర్ణాల దాడులను ఎదురుకొని ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అందించిన త్యాగ శీ లి అని కొనియాడారు అంబేద్కర్ పూలే సావిత్రి బాయ్ ఆశయ సాధన కోసం బహుజనులందరూ ఐకమత్యంతో పోరాడి రాజ్యాధికారం తెచ్చుకోవాలని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు సేవా సంఘం కాసిపేట మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్,దేవాపూర్ అంబేద్కర్ సంఘం కోశాధికారి చిప్పకుర్తి బాపు బుద్దిస్ట్ సొసైటీ సభ్యులు రాజు పాలేకర్, అనూక్ష పాలేకర్ పాల్గొన్నారు.
సోమ గూడెం లో...
![]() |
| సోమగూడెం గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి వర్ధంతి కార్యక్రమం. |
సోమగూడెం గ్రౌండ్ లో వాకర్స్,క్రీడాకారులు సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆడపిల్లలకు మహిళలకు చదువుకునే హక్కు ఉండాలని తన నిత్యజీవితంలో తనే సొంతగా టీచర్ మారి ఆడపిల్లలకు, మహిళలకు చదువు చెప్పి ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావడం జరిగిందన్నారు .
సావిత్రిబాయి పూలే కృషి మూలంగానే నేడు మహిళలు అనేక ప్రముఖ స్థానాల్లో నిలిచి ఉన్నారు. కానీ ప్రస్తుతం మహిళలను,ఆడపిల్లలను తక్కువగా చూసే దుస్థితి నేడు కూడ కొనసాగుతుంది.వీరిని కేవలం ఇంటికి పరిమితం చేస్తూ సేవలు చేసే మనుషులుగానే చూస్తున్నారుకానీ సమాజంలో సగభాగంగా ఉన్న మనుషులుగా మాత్రం చూడలేదన్నారు. దేశానికే ప్రథమ పౌరురాలిగా ఉన్న ద్రౌపతి ముర్ము ను మహిళా అనే పేరుతో ఎంతగా అవమానాలకు గురిచేస్తున్నారో కనిపిస్తోందన్నారు.
పెద్దనపల్లి మాజీ సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ సమాజంలో సగభాగం అని మాటలు చెబుతున్నారే తప్ప మనుషులుగా గుర్తించే స్థితి ఈరోజు వరకు కూడా రాలేదన్నారు.నేడు మహిళలను గౌరవించే సంస్కృతి ప్రతి ఒక్కరిలో రావలసిన అవసరం ఉందన్నారు.
వివిధ ప్రజా సంఘాల నాయకులు బోగే పోశం,బోగి రామకృష్ణ జిల్లాల రాజేందర్,మహేందర్, సామల శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్,చిలుముల శంకర్,మద్దెల బానేష్,జైని శ్రీనివాస్,పాష,అలగం సురేష్,వెంకటి తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ...
![]() |
| సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల సమర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, మండల నాయకులు. |
| కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. |
కాసిపేట మండల కమిటీ అధ్యక్షులు రత్నం ప్రదీప్ సావిత్రి భాయ్ పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రత్నం ప్రదీప్ మాట్లాడుతూ స్త్రీ అభ్యునతికి కృషి చేసిన మొట్ట మొదటి బహుజన మహిళ సావిత్రి భాయ్ పూలే అను కొనియాడా రు. సావిత్రి భాయ్ పూలే ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి బాల్యవివాహలకు, మూఢనమ్మకలకు, సతీసహా గమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని మహనీయురాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మైదాం రమేష్, SC సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, మండల నాయకులు బన్న లక్ష్మణ్ దాస్,పుర్ర కుమార స్వామి, రేషవేణి బాపుమంద వెంకటేష్,రేషవేణి స్వామిమాడవి వెంకటేష్,తిరుమల్అక్కేపల్లి రాజేష్, జాడి శివవేల్పుల కిరణ్,కుర్మా నర్సయ్య,ఆల్క రాజు,Ch శ్రవణ్కలాలి భీమయ్యతదితరులు పాల్గొన్నారు.



