రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు చేయూత స్వచ్ఛంద సేవా సమితి సహాయం.
![]() |
| పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేస్తున్న చేయూత సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. |
Scv News Kasipet:-
మందమర్రి ఏరియా కాసిపేట గని సర్వే డిపార్ట్మెంట్ కార్మికులతో నిరుపేదలకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన చేయూత స్వచ్ఛంద సేవా సమితి మంగళవారం రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేశారు. కాసీపేట మండలం చిన్న ధర్మారం గ్రామంలో పేద ముస్లిం కుటుంబాలను ఎంపిక చేసి వారికి నిత్యవసర వస్తువులు పండుగ సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వే ఆఫీసర్ మహబూబ్ ఖాన్ సేవా సమితి అధ్యక్షులు ఆడేపు రవీందర్ ప్రధాన కార్యదర్శి అంకం రాజమల్లు, సేవా సమితి సభ్యులు అసిస్టంట్ చైన్ మన్ లు విజయ్ & సందీప్ మరియు సర్వే మజ్దూర్ ఆనంద్ & మోహన్ మరియు యాక్టింగ్ సర్వే మజ్దూర్ గణేష్& ప్రవీణ్& ఆంజనేయులు ఉద్యోగులు పాల్గొన్నారు.

