ఆదియవాసి యువతను సొసైటీ ద్వారా ఆదుకోవాలి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ.
| టైకార్ చైర్మన్ కొట్నాక తిరుపతి ని శాలువాతో సన్మానిస్తున్న వేముల కృష్ణ. |
ScvNews Kasipet :--
తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కోపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ (ట్రైకార్ )చైర్మన్ కోట్నాక్ తిరుపతికి కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఈరోజు తన స్వగ్రామంలో కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ కష్టపడ్డా కార్యకర్తలకు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని, దీనికి నిదర్శనమే కొట్నాక తిరుపతికి తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కోపరేటివి ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టిందని అన్నారు. మారుమూల ఆదివాసి గ్రామాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా రుణాలను ఇప్పించాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు చెండే నవీన్ తదితరులు పాల్గొన్నారు.

