మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గని పై ఘనంగా మహిళ దినోత్సవం

 గని అధికారులు, కార్మిక సంఘ నాయకులు  మహిళా ఉద్యోగులకు శాలువాలతో సన్మానం.

 కాసిపేట గనిలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కార్మికులకు సన్మానం.


Scv news Kasipet:--

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మందమర్రి ఏరియా  కాసిపేట గని పై గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం  ఆధ్వర్యంలో  నిర్వహించారు.  కార్యక్రమనికి బన్న లక్ష్మన్ దాస్ అధ్యక్షత వహించారు.   మహిళ ఉద్యోగులు  దాసరి దేవమ్మ (జనరల్ మాజ్దుర్) రాజుల సుభద్ర(జనరల్ మాజ్దుర్),గుంజపడిగ హారిక (బదిలీ వర్కర్) కొత్నాక జ్యోతి(బదిలీ వర్కర్) మర్రి స్రవంతి (జూనియర్ అసిస్టెంట్) రేణుక (జూనియర్ అసిస్టెంట్) లను  మేనేజర్ అల్లావుద్దీన్,  AITUC బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్,AITUC  కార్యదర్శి మీనుగు లక్ష్మినారాయణ,రక్షణ అధికారి సునీల్ కుమార్,స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ బన్న లక్ష్మన్ దాస్,బాబు ఇంజనీర్ లు శాలువాలతో  ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ మహిళలు ముందు ఉండడం వల్లనే సమాజం నిర్మితమవు తుందని,ఎవరికి తక్కువ కాకుండా అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని,నింగి నేలను కూడా ఏలుతున్నారని అన్నారు. ఇల్లాలు అన్ని విభాగాలలో ముందుకు వెలితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

AITUC బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్  మాట్లాడుతూ  మహిళలు తలుచుకుంటే కానిది ఎదిలేదని, ప్రపంచాన్ని శాసించిన వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువని అన్నారు. మహిళల హక్కుల కోసం హిందు కోడ్ బిల్లు పెడితే బిల్లు ఆమోదం పొందకుండా చేయడం తో బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవిని త్యాగం చేశారని,మహిళల హక్కుల కోసం కృషి చేశారని అన్నారు.

రక్షణ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ముందుంటే సామాజికంగా, ఆర్థికంగా ముందుంటారని అన్నారు.

మీనుగు లక్ష్మి నారాయణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందుండి దేశాన్ని బాగుపర్చాలని అన్నారు.అంతకు ముందు కేక్ కట్ చేసి మహిళ దినోత్సవ సంబరాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  ఇంజనీర్ గుగ్లోత్ బాబు,సంక్షేమ అధికారి జీషాన్,సర్వేయర్ ఖాన్, POA జనార్ధన్ రెడ్డి,నాగేశ్వరరావు, ఓవర్ మేన్ మురళి, తణ్వీర్, శ్రీదర్,శ్రీనివాస్,ఉద్యోగులు పాల్గొన్నారు.