మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బదిలీ పై వెళుతున్న కాసిపేట 1మేనేజర్ అల్లావుద్దీన్ కు ఘనంగా సన్మానం.

 గని కార్మికుల ప్రేమ అభిమానాలు పొందిన అధికారి  అల్లావుద్దీన్ అని నాయకుల పొగడ్తలు.

 బదిలీపై వెళ్తున్న గని మేనేజర్ అల్లావుద్దీన్ గజమాలతో సన్మానిస్తున్న కార్మికులు.


Scv news Kasipet:--

 కాసిపేట గనిలో సుదీర్ఘ కాలం పాటు అధికారిగా పని చేసిన అల్లావుద్దీన్ కార్మికుల ప్రేమాభిమానాలు పొందిన అధికారని ఏఐటిసి జిల్లా అధ్యక్షులు చిప్ప నరసయ్య కొనియాడారు.బ్రాంచ్ కార్యదర్శి  దాగం మల్లేష్  మాట్లాడుతూ అల్లావుద్దీన్ మేనేజర్ ప్రతి కార్మికుడితో అనుబంధం కలిగిఉండి అందరిని ప్రేమతో పలకరిస్తూ పనులు చేయించుకునే వారని అన్నారు. టీబీజీకే స్  ఏరియా ఉపాధ్యక్షుడు మెడిపెళ్లి సంపత్, ఫీట్ సెక్రటరీ ఒడినల రాజన్న మాట్లాడుతూ మేనేజర్ అల్లాఉద్దీన్  ప్రకృతి ప్రేమికుడని, మానవత్వం కలిగిన వారని అన్నారు.

మందమర్రి ఏరియా కాసిపేట గని లో మేనేజర్ గా పని చేసిన అల్లావుద్దీన్ బదిలీ పై KK5 గనికి వెళుతున్న సందర్భంగా కాసిపేట గని ఉద్యోగులు , నాయకులు, అసోషియేషన్ లు ఈరోజు గాని ఆవరణలో  ఘనంగా సన్మానించారు.

గని మేనేజర్ అల్లావుద్దీన్  కాసిపేట గనిలో 1998 లో అండర్ మేనేజర్ గా వచ్చి పదేళ్లు పనిచేసిన అనంతరం  ఎం కె ఫోర్ గనికి మేనేజర్ గా వెళ్లారు. కాసిపేట గనికి పదోన్నతి పై వచ్చి కొద్ది రోజులు సేఫ్టీ అధికారిగా పని చేసి  కేకే 1గనికి వెళ్లారు. మళ్లీ మేనేజర్ గా పదోన్నతి పొంది గత మూడు సంవత్సరాలుగా మేనేజర్ గా మొత్తం  సుమారు 23 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు కాసిపేట గని అధికారిగా విధులు నిర్వహించారు. 

బదిలీపై వెళ్లిన అల్లావుద్దీన్  మేనేజర్ ను గని కార్మికులు సూపర్వైజర్ లు సభ వేదిక వరకు DJ సౌండ్ తో,నృత్యాలతో,బాణా సంచాలతో, గులాబీ రేకులతో  వేదిక వద్దకు తీసుకు వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పుల మాలలు వేసి న అనంతరం ఏఐటిసి బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రెటరీ  మీనుగు లక్ష్మీ నారాయణ , టీబీజీకేఎస్ ఓడనా నల రాజన్న,బన్న లక్ష్మన్ దాస్ సన్మాన పత్రాలను అందించారు.

అనంతరం గజమాలత్తోAITUC, TBGKS, SC/ST అసోషియేషన్, యూనియన్ నాయకులు సన్మానించారు.ఈ సందర్భంగా ఏఐటియుసి కేంద్ర నాయకుడు  చిప్ప నర్సయ్య,  మేనేజర్ గారిని,INTUC సెంట్రల్ సెక్రెటరీ రాపర్తి శ్రీనివాస్, CITU,SC/ST అసోసియేషన్, ST అసోషియేషన్ నాయకులు బత్తుల వేణు, దెబ్బటి తిరుపతి,అరుముళ్ల కృష్ణ,దరవత్ తిరుపతి అద్వర్యం లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోల్లంగి శ్రీనివాస్,మేడ సమ్మయ్య, సానిగారపు రవీందర్, అబ్దులుద్దీన్,వి. రాజేందర్, శ్రీహరి,రవి,పుప్పాల శ్రీనివాస్,బైరి శంకర్,POA జనార్దన్ రెడ్డి,అధికారులు SO సునీల్ కుమార్,ఇంజనీర్లు బాబు, మధుకర్,రామ కృష్ణ, అండర్ మేనేజర్లు నిఖిల్, వెంకటేష్, వంశీ కృష్ణ, సుమన్,WO మీర్జా గౌస్ జీషాన్,సర్వేయర్లు  వెంకటేష్, ఖాన్ తదితరులు పాల్గొన్నారు.