పునరావాస కాలనీలో నాణ్యత తో కూడిన పనులు చేపట్టాలి.
- జన సమితి అధ్యక్షుడు కోదండరాం
![]() |
| దుబ్బగూడం పునరావాస కాలనీ పనులను పరిశీలిస్తున్న కోదండరాం. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని కేకే ఓ సి లో ముంపుగురవుతున్న దుబ్బగూడం పునరావాస కాలనీ ని ఈరోజు జన సమితి అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. పునరావాస కాలనీలో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం పునరావాస కాలనీ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిపిన పనులు మెరుగ్గా చేపడుతుందని అన్నారు. కాలనీలో చేపట్టే పనులు పది కాలాలపాటు నిలిచే విధంగా నాణ్యతతో కూడిన పనులు చేయాలని కోరారు. ముంపుకు గురైన గ్రామంలోని కొంతమందికి ప్యాకేజీ డబ్బులు రావలసి ఉన్నదని వాటిని కూడా వెంటనే చెల్లించాలని కోరారు. ఆయన వెంట జన సమితి రాష్ట్ర నాయకులు బాపన్న జిల్లా అధ్యక్షుడు రామ్ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
శిలోజు మురళి కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం.
అంతకుముందు కోదండరాం కాసిపేట మండల కేంద్రాల్లో మండల జేఏసీ కన్వీనర్ సిలోజి మురళి ఇంటికి వెళ్లాడు. ఇటీవల సిలోజి మురళి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం వల్ల మురళి కుటుంబాన్ని కోదండరాం తో పాటు జన సమితి రాష్ట్ర జిల్లా నాయకులు పరామర్శించారు.
