సాచైవే ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన.
- విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు పెన్నులు అందజేత.
![]() |
| దేవాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేస్తున్న సామాజిక చైతన్య వేదిక నాయకులు. |
![]() |
| ఇంపాక్ట్ ట్రైనర్ మద్దినేని అర్జున్ ను శాలువాతో సన్మానిస్తున్న దేవాపూర్ జెడ్పి ప్రధానోపాధ్యాయుడు రమేష్. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ట్రైనర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు మద్దినేని అర్జున్ చే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు పదవ తరగతి విద్యార్థులతో పాటు స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మద్దినేని అర్జున్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని, ధైర్యంగా ముందస్తు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సూచించారు. పరీక్షల ముందు ఎలా చదువుకోవాలి, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పరీక్షలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు విద్యపై శ్రద్ధ పెట్టి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తేవాలని పలు ఉదాహరణలతో విద్యార్థులకు తెలిపారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుపై నిర్లక్ష్యం పెట్టవద్దని, చదువుపై నిర్లక్ష్యం వహిస్తే జరిగే పరిణామాలను విద్యార్థులకు వివరించారు. రెండు చేతులు లేకుండా పారా ఒలంపిక్స్ లో బంగారు పతకం గెలుచుకొన్న సీత దేవి గురించి విద్యార్థులకు వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ రమేష్ మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక నాయకులు తమ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం పట్ల అభినందనలు తెలిపారు. విద్యార్థులు పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి పాస్ అయ్యి ఎందుకు ఇంపాక్ట్ ట్రైనర్ అర్జున్ విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందితో ప్రధానోపాధ్యాయుడు రమేష్ మద్దినేని అర్జున్ ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాబు, ప్రధాన సలహాదారు మదినేని చిన్న భీమయ్య, సభ్యులు మహేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సామాజిక చైతన్య వేదిక తరపున పరీక్ష ప్యాడులను,పెన్నులను పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దామోదర్ రెడ్డి అంజాద్ పాషా, రాజేశం, తదితరులు పాల్గొన్నారు.


