కాంగ్రెస్ నాయకులు ప్రజాసేవలో ముందు ఉండాలి: ఎమ్మెల్యే వినోద్
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకట్ స్వామి. |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు స్థానిక కాంగ్రెస్ నాయకుడు షేక్ ముర్తుజా వారి తండ్రి ఫీర్ మహ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రన్ని ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ వెంకట్ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చే మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు చల్లని మంచినీరు అందించేం దుకు చలివేంద్రం చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రజా సేవలో భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్న మూర్తుజా ను ఎమ్మెల్యే వినోద్ అభినందించారు. మండలంలోని నాయకులు,కార్యకర్తలు ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్మాజీ సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు, పుర్ర కుమార్ స్వామి,sk జాని,టైగర్ కుమార్,బాకీ నరేష్, రాజన్నపంబల అరవింద్,రెహమాన్షారుక్,బోయిని మలేశ్ఉప్పులేటి తిరుపతిగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
