భగత్ సింగ్,రాజ్ గురు సుఖదేవులకు నివాళి.
పోరాటయోధులకు మరణం లేదు.
- సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి
![]() |
| భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులకు నివాళులర్పిస్తున్న వాకర్ అసోసియేషన్. |
Scv News Kasipet:--
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రౌండ్ లో వాకర్స్,క్రీడాకారుల అధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ ల వర్ధంతిని ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ
దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో చిరుప్రాయంలోనే బ్రిటిష్ వారి దుర్మార్గా చర్యల్లో ఊరికంబం ఎక్కడడం జరిగింది. తమ సొంత ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేసిన అమరవీరుల స్పూర్తితో నేడు ప్రతి ఒక్కరు పని చెయ్యవలసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాజేందర్,మహేందర్, రామ క్రిష్ణ,బోగే పోషం శ్రీనివాస్,సురేష్, రమేష్, శివ,వెంకన్న,భుమన్న మరియు వాకర్స్,క్రీడాకారులు పాల్గొన్నారు.
