మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల అంబేద్కర్ నూతన కమిటీ ఎన్నిక.

మండల కమిటీ అధ్యక్షుడిగా జాడిపోశం ఏకగ్రీవ ఎన్నిక .

 అంబేద్కర్ సంఘం మండల కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన జాడి పోశం రామిల్లకిష్టయ్యలను శాలువాలతో సన్మానిస్తున్న అంబేద్కర్ వాదులు.

 భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవులకు నివాళులర్పిస్తున్న అంబేద్కర్ వాదులు.

Scv news Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఈరోజు సాయంత్రం మండల అంబేద్కర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంబేద్కర్ వాదులు రాజకీయ నాయకులు హాజరయ్యారు. మండల నూతన కమిటీ ఎంపికపై చర్చించారు. సమావేశంలో ప్రతి రెండు సంవత్సరాలకు నూతన కమిటీని ఎంపిక చేసుకోవాలని, అంబేద్కర్ కమిటీ రాజకీయాలకతీతంగా మండలంలోని గ్రామాలలో అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేయాలని, ప్రతి నెల రెండో వారంలో మండల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తదనంతరం మండలం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 మండల కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ విగ్రహ దాత జాడిపోశం, ప్రధాన కార్యదర్శిగా రామిల్ల కిష్టయ్య, (దేవాపూర్) సహాయ కార్యదర్శిగా  అగ్గి స్వామి, ఉపాధ్యక్షులుగా గోదారుల శంకర్,గోడిసెల సురేందర్, దుర్గం రామచందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాసరి రాజన్న, ప్రచారం కార్యదర్శిగా దుర్గం సుధాకర్, ఎస్టీ సెల్ ఇంచార్జి కొమ్ముల బాపు, మైనారిటీ సెల్ ఇంచార్జి ముస్తఫా, కోర్ కమిటీ ఇన్చార్జి బన్నా లక్ష్మన్ దాస్ , సాంస్కృతిక కమిటీ ఇన్చార్జి గోడిసెలబాపు, మండల కమిటీ సలహాదారులుగా దాగం మల్లేష్ పల్లె మల్లయ్య, శిలోజు మురళి, మద్దినేని చిన్న భీమయ్య, లంక లక్ష్మణులను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన జాడి పోశం, రామిల్ల కిష్టయ్యలను శాలువాలతో సన్మానించారు.

 తదానంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద దేశ అమరవీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు  అంబేద్కర్ సంఘ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు.