మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట జూనియర్ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

 కాసిపేట జూనియర్ కాలేజీ విద్యార్థుల కు వచ్చే విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు కృషి.

-  రత్నం ప్రదీప్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.

 విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్.



Scv News Kasipet:--

 కాసిపేట జూనియర్ కాలేజ్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు శాయశక్తుల కృషి చేస్తానని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ హామీ ఇచ్చారు. ఈరోజు జూనియర్ కాలేజీలో విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.మండలంలో విద్యాభివృద్ధికి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తానని అన్నారు. కాలేజీ విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు  వీలుగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆట స్థలాన్ని చదును చేస్తానని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు.

 మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో  మండలంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి విద్యా బోధనకు వచ్చే విద్యార్థులు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయకుండా అధ్యాపకుల బోధనలను శ్రద్ధగా విని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న అధ్యాపకుల బోధనలతో గత ఐదు సంవత్సరాలుగా కళాశాల విద్యార్థులు జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణం అన్నారు. ప్రభుత్వ కాలేజీలో అన్ని వసతులు ఉన్నాయని మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలో తమ పిల్లలను చేర్పించాలని అన్నారు.

 వీడ్కోలు సమావేశం సందర్భంగా కాలేజీలోని అధ్యాపకులు వారి అనుభవాలను విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తు చేసుకున్నారు. తదనంతరం  క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు  ముఖ్య అతిథి రత్నం ప్రదీప్ చే బహుమతులను విద్యార్థులకు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపక బృందం  రత్నం ప్రదీప్ ను, రవీందర్ ను శాలువాలతో సన్మానించారు.