మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గనులలో పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం.


పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం.

 ఉద్యోగ విరమణ పొందుతున్న సామాల లక్ష్మణ్ కు సన్మాన పత్రం అందజేస్తున్న గని మేనేజర్ లక్ష్మీనారాయణ. 


Scv News Kasipet :-

మందమర్రి ఏరియా కాసిపేట 1,2 గనులలో ఉద్యోగ విరమణ చెందిన కార్మికులకు ఆయా గనుల మేనేజర్లు కార్మిక సంఘాల నాయకులు ఈరోజు గనుల ఆవరణలో ఘనంగా శాలువాలతో  సన్మానించారు.

 కాసిపేట 2 గని లో...

 సామల లక్ష్మణ్ దంపతులను సన్మానిస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు.

కాసిపేట గనిలో  ఫిట్టర్ హెల్ఫేర్ గా పనిచేసి పదవి విరమణ పొందిన సామల లక్ష్మణ్ దంపతులను గని మేనేజర్ గోడిసెల లక్ష్మీనారాయణ శాలువాతో సన్మానించి  కంపెనీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గని మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  సామల లక్ష్మణ్ అంకితభావంతో కంపెనీలో 36 సంవత్సరాలు పని చేశారని కొనియాడారు. సన్మాన కార్యక్రమంలో  రక్షణ అధికారి సంతోష్ రావు, ఇంజనీరు రఘు, సంక్షేమ అధికారి భార్గవ గుర్తింపు కార్మిక సంఘం నాయకులు దాగం మల్లేష్, ఫిట్ సెక్రెటరీ శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు రాపర్తి శ్రీనివాస్, కారుకూరి తిరుపతి, కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు  సిద్ధం తిరుపతి నస్పూర్ నర్సింగ్, పుత్తూరు సత్తయ్య, కుటుంబ సభ్యులు శాలువాలతో సామల లక్ష్మణ్ దంపతులను సన్మానించారు

కాసిపేట 1 వ గనిలో..

 ఉద్యోగ విరమణ పొందుతున్న సమ్మయ్య దంపతులను సన్మానిస్తున్న గని మేనేజర్ అల్లావుద్దీన్ కార్మిక సంఘాల నాయకులు.

కాసిపేట1వ గనిలో జనరల్ మాజ్దుర్ గా విధులు నిర్వహించిన నీలం సమ్మయ్య 36 సంవత్సరాలు విధులు నిర్వహించి నేడు పదవి విరమణ చేసిన సందర్భంగా  సన్మానించడం జరిగింది.

మేనేజర్ అల్లావుద్దీన్  మాట్లాడుతూ సమ్మ య్య క్రమ శిక్షణ తో పని చేసే వారని అందు వల్లనే పనిలో ఎలాంటి రిమార్క్ లేకుండా ఉద్యోగ విరమణ పొందడం జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి సునీల్ కుమార్,సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్,ఇంజనీర్లు బాబు,మధుకర్, అండర్ మేనేజర్ నిఖిల్,దిలీప్, వంశీ కృష్ణ, AITUC పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మినారాయణ, TBGKS నాయకులు రాజన్న,బైరి శంకర్,సోల్లంకి శ్రీనివాస్,  వి. రాజేందర్,లింగయ్య, బన్న లక్ష్మన్ దాస్, INTUC నాయకులు వేణు,శ్రీనివాస్, రవి,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.