రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత దేవాపూర్ జట్టు.
![]() |
| టోర్నమెంట్ విజేతదేవపూర్ జట్టుకు బహుమతి అందజేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం గట్రావ్ పల్లి గ్రామంలో రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొక్కిరాల సత్యపాల్ రావు ఆధ్వర్యంలో రెండు రోజుల వాలీబాల్ టోర్నమెంట్ ఈ రోజు ముగిసింది. ఈ పోటీలలో 16 టీం లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో దేవాపూర్ జట్టు విజయం సాధించి 5000 నగదు మరియు ట్రోఫీ, రెండవ బహుమతి తుడంగూడ జట్టకీ 3000 రూపాయలు ట్రోఫీ లు జుట్టు సభ్యులకు వ్యక్తిగత షీల్డ్ లు అందించారు. విజేతలకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మారావు పేట ఎంపీటీసీ పార్వతి మల్లేష్, కాంగ్రెస్ నాయకులు సత్తార్, ఓరియెంట్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుడు అన్నం కుమార్, ఆదివాసీ నాయకులు కనకరాజు, కాంగ్రెస్ నాయకులు రషీద్, జనార్థన్, భీం రావ్, అచ్యుత రావు, జయరాం, మైనారిటీ సెల్ నాయకులు షాకీర్, షకిల్, లు పాల్గొన్నారు.

