ఈ నెల 15వ తేదీన ఓరియంట్ యాజమాన్యం నాలుగో ప్లాంట్ నిర్మాణం కోసం అవసరమయ్యే సున్నపురాయి క్వారీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ.
తుడుం దెబ్బ నాయకుల మౌనం పట్ల అనుమానాలు.
![]() |
| గిరిజన హక్కుల సాధన కోసం ఓరియంట్ కర్మాగారం ముందు తుడుం దెబ్బ నాయకులు చేసిన ఆందోళన (పాత చిత్రం) |
Scv News Kasipet:--
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ యాజమాన్యం నాలుగో ప్లాంట్ నిర్మాణం కోసం అవసరమయ్యే సున్నపురాయి క్వారీ లీజు కోసం ఈనెల 15వ తేదీన కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ కోరుతుంది. ఓరియంట్ కర్మాగారం ఏర్పడి 41 సంవత్సరాలు గడుస్తున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఉద్యోగాలు, స్థానిక నిరుద్యోగ యువకులకు ఉపాధి, పరిసర గ్రామాల అభివృద్ధి జరగక స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 2018లో మూడో ప్లాంట్ అవసరమైన 275 హెక్టార్ల సున్నపురాయి ఉన్న భూమి లీజు కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఓరియంట్ యాజమాన్యం 315 మందికి మైనింగ్ లో ఉద్యోగం కల్పిస్తామని, 2200 మంది స్థానికులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని పరిసర గ్రామాలను అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చి ప్రభుత్వం నుండి లీజు పొందింది. ఆరు సంవత్సరాలు గడిచిన ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కర్మాగారం ఏర్పాట్లు భూములు కోల్పోయిన గిరిజనులకు నేటికీ నష్టపరిహారం ఉద్యోగాలు ఆదివాసి కుటుంబాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఓరియంట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 2022 జూలైలో గిరిజన పోరాట హక్కుల సమితి తుడుందేబ్బ ఆధ్వర్యంలో ఓరియంట్ కర్మాగారం ముందు పరిసర గిరిజన గ్రామాల ఆదివాసులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. అప్పటి యాజమాన్యం న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనడంతో ఆందోళన విరమించింది.
ప్రస్తుతం మళ్ళీ ఓరియంట్ యాజమాన్యం నాలుగో ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న తరుణంలో గత నాలుగు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న నిర్వాసిత ఆదివాసి కుటుంబాలతో ఆందోళన చేయాల్సిన తుడుం దెబ్బ నాయకులు మౌనం పాటించడం పట్ల గిరిజనులు తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. తుడుం దెబ్బ లోని కొంతమంది నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం అప్పుడు గిరిజనులతో ఆందోళన చేయించారని ఇప్పుడు మళ్లీ ఆందోళన చేస్తామని స్వచ్ఛందంగా గిరిజనులు ముందుకు వస్తున్న నాయకులు తప్పించుకుని తిరుగుతున్నారని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. గత ఆదివారం సమావేశమై చర్చించుకుందాం అని పిలిచిన తుడుం దెబ్బ నాయకులు రాకపోవడం పట్ల స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ లో తాము యాజమాన్యాన్ని ఎలా నిలదీయాలోనంటూ బాధిత గిరిజనులు తమకు నాయకత్వం వహించే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఓరియంట్ యాజమాన్యం గతంలో మాదిరిగానే కార్మిక సంఘాల నాయకులను స్థానిక ప్రజాప్రతినిధులను,గిరిజన సంఘాల నాయకులను ఆశలుచూపెట్టి ప్రలోభాలకు గురి చేసి సాఫీగా తన పనులు తాను చేసుకుంటూ వెళుతుంది. మళ్లీ మరోసారి అమాయక ఆదివాసి బాధిత కుటుంబాలు మోసపోయే ఆ అవకాశం ఉంది.
( గత 2022 జూన్లో తుడుం దెబ్బ నాయకులు చేసిన ఆందోళన వారి మాట్లాడిన మాటలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోను వీక్షించండి.)

