మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోమగూడెం న్యూ కాలనీలో నిఘా నేత్రాల ఏర్పాటు

  నిఘా నేత్రాల ఏర్పాటు చేసినందుకు మాజీ సర్పంచ్ వేముల కృష్ణకు సోమ గూడెం  న్యూ కాలనీవాసులు అభినందనలు.

 సోమ గూడెం న్యూ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభిస్తున్న ఎస్సై గంగారాం, ముఖ్యఅతిథిగా హాజరైన సోమగూడెం వాసి సినీ నటుడు గడ్డం సురేష్, మాజీ సర్పంచ్ వేముల కృష్ణ.


Scv News Kasipet:--

 మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్, స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు అనగా తేదీ 01-02-2024 న సోమగూడెం న్యూ కాలని, పెద్దనపల్లి గ్రామ పంచాయతీ లో మాజీ సర్పంచ్ వేముల కృష్ణ  ఏర్పాటు చేసిన 4- సీసీ కెమెరాల ను కేటాయిస్తాయి గంగారం ప్రారంభించారు. గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు మాజీ సర్పంచ్ వేముల కృష్ణ ను అభినందించారు. ఈ సందర్భంగా  ఎస్ఐ గంగారాం గారు మాట్లాడితూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలు, వ్యాపారస్థులు, ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలను సురక్షితంగా, నేరా రహిత గ్రామాలుగా ఉంచుకోగలరని ప్రజలకు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏయస్ఐ రవీందర్, ముఖ్య అతిథిగా సినిమా రచయిత, నటులు గడ్డం సురేష్  వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, కంచర్ల పద్మ, బన్న హిందుమతి, గ్రామస్తులు బన్న శ్రీనివాస్, శ్రీధర్, శ్యాం, నరేష్ కారోబార్ మురళి లు పాల్గొన్నారు