మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కొండాపూర్ లో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం.

 కాసిపేట మండలంలో  కోటి 20 లక్షల తో అభివృద్ధి పనులు.

- రత్నం ప్రదీప్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 

 సిమెంటు రోడ్డు పనులను ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్.


Scv News కాసిపేట :--

 కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నం ప్రదీప్ మాట్లాడుతూ కాసిపేట మండల అభివృద్ధి కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్  కోటి 20 లక్షల  ఎన్ ఆర్ జి ఎస్  నిధులను మంజూరు చేయించాడని అన్నారు. ఈ నిధులతో మండలంలోని   సిమెంటు రహదారులు, మురికి కాలువలను నిర్మించి మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. కొంతమంది అవగాహన లేని టిఆర్ఎస్ నాయకులు కాంట్రాక్ట్ పనులు గిరిజనులకు ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారని గత పది ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో పనులు ఎవరు చేశారని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే కమీషన్ల కు ఆశపడే వ్యక్తి కాదని  నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని అన్నారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో  కోనూరు మాజీ సర్పంచ్ పుత్తూరు సత్తయ్య, అప్పని ప్రభాకర్, కొండాపూర్ మాజీ సర్పంచ్ మక్కల శ్రీను, సిగ్నల్ విండో మాజీ చైర్మన్ వంశీధర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మైదం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, కొండాపూర్ కాంగ్రెస్ నాయకులు చారి,మాంకాళి,తదితరులు పాల్గొన్నారు.