మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పదవి కాలం ముగించుకున్న సర్పంచ్ లకు మండల పరిషత్ అధికారుల సన్మానం.

తాజా మాజీ సర్పంచులకు మండల పరిషత్ అధికారుల సన్మానం చేయడం పట్ల ధన్యవాదాలు.

- పెద్దనపల్లి మాజీ సర్పంచ్ వేముల కృష్ణ.

 ఐదేళ్ల పదవీకాలం ముగించుకున్న  సర్పంచులను సన్మానించిన మండల పరిషత్ అధికారులు ప్రజాప్రతినిధులు. 


Scv News Kasipet:--

 కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ఐదేళ్ల పదవి కాలం ముగించుకున్న మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులను కాసిపేట మండల పరిషత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి శాలువాలతో సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు  విక్రం రావు, ఎంపీడీవో ఎంఏ అలీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్దనపల్లి  సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ ఐదేళ్ల పదవీకాలం ముగించుకున్న మండల సర్పంచులను  మండల పరిషత్ అధికారులు ప్రజాప్రతినిధులు సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.  నాతోటి సర్పంచులకు ప్రజలకు సేవ చేసే అవకాశం మరోమారు రావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. సమావేశంలో పలువురు  సర్పంచులు ఐదేళ్లపాటు తన పంచాయతీ అభివృద్ధికి పాటుపడిన పలు విషయాలను గుర్తుచేసుకొని, స్మరించుకోవడం జరిగింది.