దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కార్మాగారం సున్నపురాయి క్వారీ కోసం జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కు ముందు గత నాలుగు దశాబ్దాలుగా తమకు జరిగిన అన్యాయంకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్వాసితుల డిమాండ్.
![]() |
| ఓరియంట్ కర్మాగారంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసిత కుటుంబాలు. |
ఓరియంట్ యాజమాన్యం రెవెన్యూ అధికారులు కుమ్మక్కై తమ భూములను స్వాధీనం చేసుకుని పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని నిర్వాసిత ఆదివాసులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులకు చాలాన్ కట్టి రీ సర్వే చేయడంతో తమ భూములు ఓరియంట్ ఆధీనంలో ఉన్నాయని 2010లో తేలింది. గత 14 ఏళ్లుగా సర్వే రిపోర్టులను పట్టాదారులకు ఇవ్వకుండా ఓరియంట్ యాజమాన్యం తన పలుకుబడి ఉపయోగించి అడ్డుకుంటుంది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే జిల్లా కలెక్టర్ సర్వే రిపోర్టులను వెల్లడించి అప్పటి నుండి తమ భూములకు నష్టపరిహారంతో పాటు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దేవాపూర్ ఓరియంట్ నిర్వాసిత ఆదివాసులు వేడుకుంటున్నారు.
ఓరియంట్ ఆదివాసి నిర్వాసిత కుటుంబాల దీన గాధల గురించి తెలుసుకుందాం...
దేవాపూర్ ఆదివాసి పెద్ద పటేల్ సిడాం జలపతి నే పెద్ద మోసం చేసిన ఓరియంట్ యాజమాన్యం.
![]() |
| తమకు ఉద్యోగాలు ఇవ్వాలని పెద్ద పటేల్ సిడం జలపతి వారసుల విన్నపం. |
కర్మాగార నిర్మాణం లో 85 ఎకరాల భూమిని కోల్పోతే 35 ఎకరాల భూమికి పరిహారం, ఐదుగురికి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది.
- మిగతా 50 ఎకరాలు తమ ఆధీనంలో లేదని ఓరియంట్ యాజమాన్యం బుకాయింపు.
- 40 ఏళ్లుగా పరిహారం, ఉద్యోగాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నా పెద్ద పటేల్ సిడాం జలపతి వారసులు.
దేవాపూర్ పెద్ద పటేల్ సిడాం జలపతి, తమ్ముడు బిలాజి లకు దేవాపూర్ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములు ఉండేవి. తండ్రి వారసత్వంగా వచ్చిన భూముల ను ఇద్దరు అన్నదమ్ములు పంచు కున్నారు. జలపతి పటేల్ కు జంగు, రామస్వామి అనే ఇద్దరు కొడుకులు దేవేంద్ర భాయి అనే కూతురు ఉంది. బిలాజి కి తెలంగా రావు, రామదాసు అనే ఇద్దరు కొడుకులతో పాటు జంగు బాయి, లక్ష్మి,అల్లిరాణి అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. జంగు బాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.
ఓరియంట్ కర్మాగార నిర్మాణంలో జలపతి పటేల్ కోల్పోయిన భూమి వివరాలు ఇలా ఉన్నాయి.
సర్వే నెంబర్ 84 / 66 లో 16.00 ఎకరాలు, సర్వే నెంబర్ 59లో 8.39 ఎకరాలు, సర్వే నెంబర్ 60 లో 6.34 ఎకరాలు, సర్వే నెంబర్ 61 లో 13.29 ఎకరాలు, సర్వే నెంబర్ 62లో 10.23 ఎకరాలు మొత్తం 56.0 5 ఎకరాల భూమి ఓరియంట్ కర్మాగారం నిర్మాణం లో కోల్పోయారు.
జలపతి పటేల్ తమ్ముడు బిలాజి కోల్పోయిన భూమి వివరాలు ఇలా ఉన్నాయి.
సర్వే నెంబర్ 84 /53 లో 16 ఎకరాలు,సర్వేనెంబర్ 72 లో 6.06 ఎకరాలు, సర్వే నెంబర్ 60 లో 6.34 ఎకరాలు మొత్తం 29 ఎకరాలు సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో కోల్పోయారు.
జలపతి పటేల్,బిలాజీ కుటుంబానికి వివిధ సర్వే నంబర్లలో ని భూమి మొత్తం 85 ఎకరాల భూమి ఓరియంట్ నిర్మాణంలో కోల్పోగా కేవలం కొన్ని సర్వే నెంబర్లు కు చెందిన 35 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం, ఐదుగురి వారసులకు ఉద్యోగాలు ఇచ్చారు.
జలపతి కుటుంబ వారసులు ఉద్యోగాలు పొందిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
* జలపతి, బిలాజీ కి చెందిన సర్వే నెంబర్ 59 లో 4.10 ఎకరాలు కోల్పోతే అతని జలపతి మనుమడు అచ్యుత రావు కు, బిలాజి కొడుకు రామదాసుకు ఉద్యోగం ఇచ్చారు.
* సర్వే నంబర్ 84/19 లో బిలాజి కి చెందిన 10.17 ఎకరాల భూమి కోల్పోతే అతడి ఇల్లరికపు అల్లుడు టేకం రఘు కు ఉద్యోగం ఇచ్చారు.
* సర్వే నెంబర్ 84 / 53 లో బిలాజి కి చెందిన 4.14 ఎకరాల భూమి కోల్పోతే అతని పెద్ద కుమారుడు తెలంగారావుకు ఉద్యోగం ఇచ్చారు.
* సర్వే నెంబర్ 62 / 2 లో జలపతి పటేల్ కి చెందిన 4.09 ఎకరాల భూమి కోల్పోతే అతని చిన్న కొడుకు సిడాం రామస్వామి కి ఉద్యోగం ఇచ్చారు.వీరి ఐదుగురు పేరిటే ఒక్కొక్కరికి మూడు నాలుగు సార్లు ఉద్యోగాలు ఇచ్చినట్టు రెవెన్యూ అవార్డుల్లో ఓరియంట్ యాజమాన్యం చూపించింది.
ఓరియంట్ యాజమాన్యం భూ ఆక్రమణలన్నీ నిజాలేనని చట్టబద్దమైన పోరాటంలో 30 ఏళ్లకు రుజువు చేసిన అలు పెరుగని గిరిజన పోరాట యోధుడు తెలంగారావు.
![]() |
| ఓరియంట్ కబ్జాలో ఆదివాసుల భూములు ఉన్నాయని నిరూపించిన తెలంగారావు. |
జిల్లా సర్వే అధికారుల కొలతలతో ఓరియంట్ ఆధీనంలో నే తన భూమి ఉన్నదని గుర్తింపు.
న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన తెలంగారావు.
గత పదేళ్లుగా హైకోర్టు తీర్పును అమలు పరచక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారులు .
ఓరియంట్ యాజమాన్యం ఆదీనం లోనే తమ వందలాది ఎకరాల భూములు ఉన్నాయని తమకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని గత 30 ఏళ్లుగా అమాయక ఆదివాసి కుటుంబాలు సిమెంట్ కర్మాగారం ముందు ఆందోళనలు,నిరసన దీక్షలు చేపడుతున్నాయి. ఓరియంట్ యాజమాన్యం వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా కనికరం లేకుండా మీ భూములు మా వద్ద లేవు, సమీప అడవుల్లో గుట్టల్లో ఉన్నాయని బుకాయిస్తూ, రెవెన్యూ శాఖను సంప్రదించాలని మొండికేసి పట్టాదారులైన ఆదివాసులకు అన్యాయం చేస్తూ వచ్చింది. భూసేకరణలో తమ ప్రమేయం లేదని రెవెన్యూ అధికారులు సూచించిన వారికే పరిహారం ఉద్యోగాలు ఇచ్చామని ఇన్నాళ్లు తప్పించుకుంది.
సిడాం తెలంగా రావు కుటుంబానికి చెందిన అతని పెదనాన్న దేవాపూర్ పెద్ద పటేల్ చలపతి, వారి నాన్న బిలాజి పేరిట ఉన్న 85 ఎకరాల భూమి ఓరియంట్ సిమెంట్ కర్మాగార నిర్మాణంలో పోయింది.3 5 ఎకరాలకు పరిహారం, ఐదుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా 50 ఎకరాల పరిహారము, తమ కుటుంబ వారసులైన 35 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగారావు. ఓరియంట్ యాజమాన్యంపై పోరాటానికి దిగాడు.గత 30 ఏళ్లుగా తమకు న్యాయం జరగాలని పోరాటం చేసిన యాజమాన్యం దిగిరాక పోవడంతో గిరిజన సొసైటీ పేరిట సిడాం తెలంగారావు, కుర్సింగ హనుమంతరావు నాయకత్వంలో చట్టబద్ధ పోరాటానికి దిగారు.
సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ శాఖ ద్వారా ఓరియంట్ సిమెంట్ యాజమాన్యం సేకరించి న భూమి వివరాలు తెలుసుకు న్నారు. దాని ఆధారంగా 175 మంది భూ నిర్వాసితులతో భూమి కొలతల కోసం ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా సర్వే అధికారులకు 2008లో చాలన్ కట్టించారు. రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ చుట్టూ సంవత్సరా లుగా తిరిగినా పట్టించుకోలేదు. ఓరియంట్ ఆధీనంలోని భూముల కు జిల్లా సర్వే అధికారుల వద్ద నిర్వాసిత రైతులు కట్టిన చాలన్ లతో రీ సర్వే చేయాలని తెలంగా రావు హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టు భూనిర్వాసితులకు అను కూలంగా తీర్పు ఇచ్చి సర్వే చేయిం చాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిం చింది. 2010లో జిల్లా సర్వే అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఓరియంట్ కర్మాగారం ఆదీనంలో ఉన్న భూముల కొలతలు ప్రారంభ మయ్యాయి. తెలంగా రావు నాన్న బిలాజి కికి చెందిన సర్వే నెంబర్ 72 లో ని 6.06 ఎకరాల భూమి మొత్తం ఓరియంట్ సిమెంట్ యాజమాన్యం ఆధీనంలో ఉందని జిల్లా సర్వే అధికారులు సర్వే నిర్వహించి తేల్చారు. దానికి సంబంధించిన పంచనామా రిపోర్ట్ ను కూడా తెలంగారావుకు అందించారు. దీంతో గత 30 ఏళ్లుగా ఓరియంట్ యాజమాన్యం గిరిజనుల భూములు తమ ఆధీనం లేవని బుకాయించిన దొంగ మాటలకు చరమగీతం పాడి నట్లయింది. ఓరియంట్ యాజమా న్యంపై ఇన్నాళ్లకు విజయం సాధిం చామని నిర్వాసిత కుటుంబాల్లో ఆనందం విరిసింది. జిల్లా సర్వే అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్ తో కోల్పోయిన భూములకు నష్ట పరిహారం తో పాటు 35 మందికి ఉద్యోగాలు కల్పించాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వీరందరికీ పరిహారం ఉద్యోగాలు కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.కోర్టు తీర్పును అమలు పరిచే బాధ్యత అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు అప్ప చెప్పింది. కోర్టు తీర్పును అమలు కాకుండా ఓరియంట్ యాజమా న్యం తన పలుకుబడిని ఉపయో గించి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
పది ఎకరాల భూమి ఓరియంట్ ఆధీనంలో ఉన్న పరిహారం కోసం పోరాడుతున్న సీడం మహదు వారసులు.
దేవాపూర్ పంచాయతీలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన సిడాం మహదు తండ్రి పేరు భీమ్ కు సర్వే నెంబర్ 84 / 39 లో నైజాం ప్రభుత్వ హాయంలో పంపిణీ చేసిన 16 ఎకరాల భూమి ఉంది. అతనికి ఇద్దరు కొడుకులు. సిడం భీమ్,సిడం సోనేరావు 16 ఎకరాల భూమి ఉంది. ఇద్దరు కొడుకులకు చేరి 8 ఎకరాలు పంపిణీ చేశాడు.మొత్తం 16 ఎకరాల భూమిని ఓరియంట్ కర్మాగార నిర్మాణంలో కోల్పోయా డు.16 ఎకరాల భూమిలో 5.28 ఎకరాలు మాత్రమే పోయిందని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడం తో ఆ భూమికి మాత్రమే పరిహారం చెల్లించి పెద్దకొడుకు భీమ్ కు ఓరియంట్ కర్మాగారంలో ఉద్యోగం ఇచ్చారు. మిగతా 10. 12 ఎకరాల భూమి కింద మిగతా కొడుకు సోనియా రావు కూడా ఉద్యోగం ఇచ్చి పరిహారం చెల్లించాలని మహదు రెవెన్యూ,ఓరియంట్ యాజ మాన్యం చుట్టూ దశాబ్దాలుగా తిరిగినా పట్టించుకోలేదు.
భూమిని కోల్పోయి కడు పేదరికంలో నివసిస్తున్న కుర్సింగ ఇస్రు, వెంకటి వారసులు.
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కుర్సింగ ఇస్రు, వెంకటి ఇద్దరు అన్నదమ్ములు. వారి తండ్రి బిక్కు వారసత్వంగా నైజాం ప్రభుత్వ హాయంలో జీవనోపాధి కోసం చేరి 16 ఎకరాల చొప్పున 32 ముప్పై రెండు ఎకరాలు పంపిణీ చేశారు. కుర్సింగ ఇస్రు, పేరిట సర్వే నెంబర్ 84/48 లో 16 ఎకరాలు,కుర్సింగ వెంకట పేరిట సర్వే నెంబర్ 84 /84 లో 16 ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ భూమి మొత్తం 1979లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ చేసి స్వాధీనం చేసుకున్నారు.
కుర్సింగ ఇస్రు కు నాగేశ్వరరావు హనుమంతు సూరుబాయ్, చిన్ను బాయ్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు . కుర్సింగ వెంకట్ కి పిల్లలు లేరు . ఇద్దరికి సంబంధిం చిన 32 ఎకరాల భూమి కుర్సింగ ఇస్రు ఆధీనం లోనే ఉండేది. భూ సేకరణ సమయంలో ఇస్రు నలుగు రు పిల్లలు చిన్నవారుగా ఉన్నారు. భూ సేకరణ సమయంలో రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి వీరి భూమిలో కొంత వేరే వారి పేరిట పట్టాలు సృష్టించి పరిహారం రెవెన్యూ అధికారులు స్వాహా చేసి ఉద్యోగాలు వేరే వారి పేరిట పెట్టించి వీరికి తీవ్ర అన్యాయం చేశారు. కుర్సింగ ఇస్రు కు చెందిన సర్వే నెంబర్ 84 /48 లోని 16 ఎకరాల భూమిలో 0.39 ఎకరాలు, వెంకట్ కి చెందిన సర్వే నెంబర్ 84 / 64 లో ని 16 ఎకరాలలో 4.18 ఎకరాలను వేరే వారి పేరిట పట్టాలు చేసి పరిహారం, ఉద్యోగాలు వేరే వారు పొందారు .
తమ భూములు మొత్తం కోల్పోయాము తమకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని ఇస్రు,వెంకటి కుటుంబాలు ఓరియంట్ యాజమాన్యంను అడిగితే మాకు సంబంధం లేదు కలెక్టరు భూసేకరణలో భూములు కోల్పోయిన రైతుల వివరాలు ఇస్తే వారికి మాత్రమే పరిహారము, నష్టపరిహారం ఇచ్చామని భూమి తో మాకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. కనీసం 16 ఎకరాల భూమి లో కోల్పోయిన మిగతా 15.01 ఎకరాల ఇస్రు భూమికి, వెంకట్ కి సంబంధించిన 11.22 ఎకరాలు మొత్తం 26.23 ఎకరాల భూమి కైనా పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని అమాయక ఆదివాసీలు కోరిన ఓరియంట్ యాజమాన్యం పట్టించుకోలేదు. మీ భూమి మా ఆధీనంలో లేదు రెవెన్యూ అధికారులను అడుక్కోవాలని దబాఇంచారు.
కుర్సింగ ఇస్రు, వెంకటి లు కన్నతల్లి లాంటి తమ భూమి తమ కళ్ళ ముందే కనుమరుగై పోయిందని మనోవేదనకు గురై వృద్ధాప్యంలో గత 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారి వారసులు నాగేశ్వరరావు, హనుమంతులు తమ తండ్రులకు జరిగిన అన్యాయంపై తమ భూమి పరిహారం, ఉద్యోగాల కోసం చట్టబద్ధ పోరాటానికి దిగారు. గత 30 ఏళ్లుగా ఓరియంట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులైన గిరిజనులకు పరిహారం, ఉద్యో గాలు ఇవ్వాలని పోరాడుతు న్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఓరియంట్ లో కోల్పోయిన భూముల వివరాలు సేకరించారు. ఓరియంట్ కర్మాగారం అధీనంలో ని భూములను రీ సర్వే చేయాలని నిర్వాసిత రైతులతో జిల్లా సర్వే అధికారులకు చాలన్ కట్టించారు. వారి తండ్రి ఇస్రు పేరిట ఉన్న సర్వే నెంబర్ 84/ 48 లోని 16 ఎకరాల భూమిలో 0.39 ఎకరాలు పోగా మిగతా 15.01 భూమి వివరాలు వెల్లడించాలని చాలాన్ నంబర్ 1/1/4 తేదీ 2/4/2008, వెంకటి పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 84/64 లో 16 ఎకరాలలో 4.18 ఎకరాలు పోగా 11.22 భూమి ఎక్కడుందో తెలపాలని చాలాన్ నంబర్ 17038 తేదీ 15.10.2008లో జిల్లా సర్వే అధికారి పేరిట కొలతలు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అయినా రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంతో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2010 నుండి రీ సర్వే ప్రారంభమైంది. రీ సర్వే లో వీరి భూములు మొత్తం కంపెని ఆధీనంలో ఉన్నట్లు తేలింది.
ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో ఎనిమిది ఎకరాల భూమి కోల్పోయి నష్టపరిహారం ఉద్యోగం అందని కోవా పాండు కుటుంబం.
దేవాపూర్ గ్రామానికి చెందిన కోవా రాము, కోవా పాండు ఇద్దరు అన్నదమ్ము లు. రాముకు బొజ్జు,హనుమంతు బారిక్ రావు ముగ్గురు కుమారు లు. కోవా పాండుకు రాము,లచ్చు, మానుకు అనే ముగ్గురు కుమారు లు ఉన్నారు. వీరి తండ్రికి నైజాం ప్రభుత్వ హాయంలో జీవనోపాధి కోసం సర్వే నెంబర్ 84/1లో 16ఎకరాల భూమి పంపిణీ చేశారు. తండ్రి మరణానంతరం ఈ భూమిని ఇద్దరు అన్నదమ్ములు కోవా రాము,పాండు చెరి ఎనిమిది ఎకరాలు పట్టాలు చేసుకున్నారు. 1980 లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో భూసే కరణలో వారి 16 ఎకరాల భూమి మొత్తం పోయింది. కొవా రాము కు చెందిన ఎనిమిది ఎకరాల భూమి కింద అతని ఇద్దరు కుమారులు కోవా బొజ్జు, కొవా హనుమంతు కు కంపెనీ ఉద్యోగాలు ఇచ్చింది.
కోవా పాండు కు చెందిన ఎనిమిది ఎకరాల భూమి ఓరియంట్ నిర్మాణంలో పోయిన ముగ్గురు కొడుకులు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇద్దరు అన్నదమ్ముల పట్టా భూములు వేరయినా రాము కుటుంబంలో రెండు ఉద్యోగాలుఇచ్చి ,పాండు కుటుం బంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వక పోవడంతో పాండు ముగ్గురు కుమారులు తమకు అన్యాయం జరిగింది,న్యాయం చేయాలని గత 40 ఏళ్లుగా ఓరియంట్ యాజ మాన్యం, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమకు జరిగిన అన్యా యం పై న్యాయం చేయాలని కార్మాగారం ముందు ఆందోళనకు దిగారు. 2012లో పాండు వారసు లైన ముగ్గురి కుమారులకు ఉద్యో గం వచ్చేందుకు యాజమాన్యం తిరిగి వచ్చింది. తమ కుటుంబం లోని ఐదుగురికి ఉద్యోగాలు ఇవ్వాలని పాండు వారసులు పట్టుబట్టగా ప్రస్తుతం ముగ్గురికి తాత్కాలిక లోడింగ్ ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరం తర్వాత పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. లోడింగ్ ఉద్యోగులుగా కోవా రాము,లచ్చు, మానుకు లకు పదేళ్ల క్రితం ఉద్యోగాలు కల్పించిం ది. సంవత్సరం తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నా హామీని తుంగలో తొక్కింది. పర్మినెంట్ ఉద్యోగులుగా ఇవ్వాలని పాండు వారసులు పదేళ్లుగా కోరుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదు. లోడింగ్ లో ఉద్యోగులుగా నియమించిన నెలకు రెండు, మూడు డ్యూటీ ల కంటే ఎక్కువ దొరక కపోవడంతో చాలి చాలని జీతాలతో గత దశాబ్ద కాలంగా పస్తులతో గడుపుతున్నారు.
జాక్వెల్ బావుల నిర్మాణంలో భూములు కోల్పోయిన ఆదివాసీ లకు, పరిహారం ఉద్యోగాలు ఇవ్వ డంలో ఓరియంట్ యాజమాన్యం మొండి చేయి.
- నాయకుల మోసపూరిత ఒప్పందంతో భూములు కోల్పోయిన 26 ఏళ్లకు పర్మనెంట్ కు బదులు లోడింగ్ ఉద్యోగాలు.
- లోడింగ్ ఉద్యోగంలో చేరక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని 37 ఏళ్లుగా అవిశ్రాంతిగా రాజీలేని పోరాటం చేస్తున్న కురిసింగ భీమ్ వారసులు.
- హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అమలు కాని వైనం...
ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఉత్పత్తి, ఇతర నీటి అవసరాలు తీర్చుకునేందుకు రాంపూర్ గ్రామ శివారు లోని వాగులో రెండు పెద్ద జాక్వాల్ బావులను 1985 లో తవ్వింది. బావుల నుండి పెద్దపెద్ద మోటార్ల ద్వారా నీటిని కంపెనీ అవసరాల కోసం సరఫరా చేసు కుంది. పై నుండి వచ్చే పెద్దవాగు నీటి మొత్తాన్ని వాడుకోవడంతో వేసవిలో వాగు ఎండిపోయి పశు వులకు కూడా తాగు నీరు అందేది కాదు. గత 2007 లో కర్మాగారం లోని క్వారీ లోనే పెద్ద మైసమ్మ సాగర్ చెరువు తవ్వి ఆ నీటిని వాడుకోవడం వల్ల ప్రస్తుతం జాక్వెల్ బావులు తాత్కాలికంగా నిరుపయోగంగా నే ఉన్నాయి.
జాక్వెల్ బావుల నిర్మాణంలో పెద్దవాగు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి రైతులకు చెందిన 18 ఎకరాల భూమి కోతకు గురై పనికి రాకుండా పోయింది. కోల్పోయిన భూములకు పరిహారం,ఉద్యోగాలు ఇవ్వాలని 1985 నుండి భూము లు కోల్పోయిన 10 మంది ఆదివా సీ కుటుంబాలు యాజమాన్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. అధికారులు, నాయకుల చుట్టూ తిరిగిన ఫలితం లేక పోవడంతో న్యాయం కోసం కోర్టులను ఆశ్ర యించారు. వీరికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
నాయకుల మోసపూరిత ఒప్పందంతో లోడింగ్ ఉద్యోగాలు .
సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఒప్పందం ఉన్న ఓరియంట్ యజ మాన్యం రాంపూర్ నిర్వాసిత గిరిజనులకు అమలు చేయలేదు. ఉద్యోగాల కోసం గత 26 ఏళ్లుగా రాంపూర్ గిరిజనులు ఆ విశ్రాంతి పోరాటం చేశారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించారు. రాంపూర్ నిర్వాసిత గిరిజన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టంగా తీర్పు ఇచ్చిన యాజమా న్యం అమలు చేయలేదు. కోర్టు ఆదేశాల కాపిలు రాంపూర్ నిర్వాసిత గిరిజనులకు అందలేదు. కోర్టు తీర్పు విషయం తెలవక తమ తోటి గిరిజన నాయకుల మోసపు మాటలను విని తీవ్రంగా నష్టపోయారు.
కోర్టు తీర్పు ప్రకారం రాంపూర్ జాక్ వెల్ నిర్వాసిత గిరిజనులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా యాజమాన్యం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. పైగా వారిని బుజ్జగించేందుకు కర్మాగారంలో ఉద్యోగులుగా పనిచేసి వారి తొత్తులుగా మారిన అదే గ్రామానికి చెందిన కొంత మంది గిరిజన నాయకులను రంగంలోకి దించింది. వారు రాంపూర్ నిర్వా సిత రైతులతో మాట్లాడి మీరు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిన మీకు పర్మినెంట్ ఉద్యోగాలు రావు, ప్రస్తుతం కంపెనీ ఇచ్చే లోడింగ్ ఉద్యోగాల్లో చేరండి, తర్వాత పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారాని ఆశలు చూపారు. అప్పటికే 26 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడిన రాంపూర్ నిర్వాసిత రైతులు కొద్ది రోజులకు పర్మినెంట్ చేస్తారని ఆశతో ప్రస్తుతం ఆకలితో అల మటిస్తున్న తమ కుటుంబాలను పోషించు కునెందు కు లోడింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు ఒప్పు కున్నారు.2011లో రాంపూర్ నిర్వాసిత గిరిజనులు 8 మంది మరప రాము, మడావి జంగు, చందు,అర్జు,రాము, లింగు,భీమ్, జూగునాక బొజ్జు లకు లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చారు.
ఉద్యోగాలు ఇచ్చారు డ్యూటీలు ఇవ్వడంలో మొండిచేయి.
రాంపూర్ నిర్వాసిత గిరిజనులకు తాత్కాలిక లోడింగ్ ఉద్యోగాలు 2011లో కల్పించిన ప్రతి నెలా కనీసం పది డ్యూటీలు కూడా కల్పించలేదు. కొద్ది రోజులకు పర్మినెంట్ చేస్తామన్న హామీ ఇచ్చి లోడింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు ఒప్పిచ్చిన నాయకుడు మాట తప్పాడు. లోడింగ్ ఉద్యోగంలో డ్యూటీ లు లేక చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించు లేక రాంపూర్ నిర్వాసిత కుటుంబాలు ఆకలితో అలమటిం చాయ్. భూములు కోల్పోయిన తమకు నెలలో పూర్తి డ్యూటీ లు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. కొద్దిరోజులకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని లోడింగ్ ఉద్యోగంలో చేరి 12 ఏళ్లు గడుస్తున్నా కుటుం బాల పోషణకు సరిపడే డ్యూటీలు కల్పించడం లేదని తమకు న్యాయం చేయాలని రాంపూర్ నిర్వాసిత గిరిజనులు సంఘం నాయకులను ప్రజాప్రతి నిధులను కోరినా ఫలితం లేకుండా పోయింది.
సై లో ఎక్కి హక్కుల సాధన.
20 ఏళ్లు గడిచినా తమకు డ్యూటీలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జాక్వెల్ నిర్వాసిత లోడింగ్ కార్మికుడు సిడాం శంకర్ 2022 లో సైలో పైకి ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గుర్తింపు సంఘం నాయకులు, పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడంతో జాక్వెలిన్ నిర్వాసిత లోడింగ్ కార్మికులతో పాటు, లక్కీ డ్రా లో లోడింగ్ ఉద్యోగాలు పొందిన 30 మంది, నిర్మాణం కోల్పోయిన ముగ్గురు మొత్తం 40 మందికి నెలకు ఇరవై డ్యూటీలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.
జాక్వెల్ బావుల త్రవ్వకాలలో భూములు కోల్పోయి పరిహారం, ఉద్యోగాల కోసం 37ఏళ్లుగా ఆ విశ్రాంతి పోరాటం చేస్తున్నా కురిసింగా బీమ్, సోము వారసులు.
భూములు ఓరియంట్ ఆదీనం లో ఉన్నాయని జిల్లా సర్వే అధికారులు నిర్ధారించి పంచనామా రిపోర్ట్ ఇచ్చిన పట్టించుకోని యాజమాన్యం.
పంచనామ రిపోర్టు హైకోర్టును ఆశ్రయించిన బాధితులు.ఉద్యోగా లు పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన అమలు కాని వైనం.
జాక్వెల్ భూనిర్వాసితులకు లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చిన, చట్టప్రకారం పర్మినెంట్ ఉద్యోగాలు కావాలని 37ఏళ్లుగా ఓరియంట్ యాజమాన్యంపై ఆ విశ్రాంతి పోరాటం చేస్తున్న కురిసింగా భీమ్, సోము వారసుల దీన గాధ గురించి..
రాంపూర్ గ్రామానికి చెందిన కురిసింగా భీమ్, సోము ఇద్దరు అన్నదమ్ములు. వీరికి వేరువేరు సర్వే నెంబర్లలో నాలుగు ఎకరాల భూమివుంది. కురిసింగా భీమ్ కు సర్వే నెంబర్ 84 / 2/ 34 లో 1.10 ఎకరాలు, కురిసింగా సొము కు అతని భార్య జంగు బాయి పేరు మీద సర్వే నెంబర్ 84 /2/21 లో 2.27 ఎకరాల పట్టా భూమి ఉంది. 1985 సంవత్సరం లో ఈ భూమి పెద్దవాగు దక్షిణ భాగంలో ఉన్న జాక్వెల్ బావిలో, కొంత రైల్వే ట్రాక్ లో పోయింది.కోల్పోయిన భూమి కింద ఉద్యోగము పరిహారం చెల్లించాలని పట్టాదారులు కురు సింగా భీము, సూరు ఓరియంట్ యాజమాన్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వృద్ధాప్యంతో మృతి చెందారు. వారి తర్వాత వారసులు భీమ్ కొడుకు బల్లార్షా, సూరు భార్య జంగు బాయిలు కూడ ఆనారోగ్యంతో మృతిచెందారు. సురు కు ఇద్దరు కొడుకులు వెంకట్రావు, బొజ్జురావు లు. భీమ్ మూడవ తరం వారసులు కురు సింగా రమ్య, ద్రౌపతి భాయి శ్రీకాంత్ లు, సోము వారసులు పెద్ద కొడుకు వెంకట్రావు అనారోగ్యంతో పని చేయలేని పరిస్థితులు ఉండటంతో అతని కూతురు ఇంద్ర బాయి,అంజయ్య,జగన్ లు ఉద్యోగాలు పరిహారం కోసం నేడు పోరాడుతున్నారు.
తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా సర్వే అధికారులకు చాలన్ కట్టారు.కురిసింగా భీమ్ వారసులు 17. 8.2010 లో రూ. 360 చెల్లించి చాలన్ కట్టారు. చలాన్ నెంబర్ 12945. భూమి కొలతల గురించి మంచిర్యాల ఆర్డిఓ B/DyIos/82/2011 తేదీ 30.11.2011 ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సర్వే అధికారి గంగాధర్ సర్వే చేసి 84/2/834లో ని మొత్తం భూమి 1.10 ఎకరాలు ఓరియంట్ యాజమాన్యం ఆధీనం లోనే ఉందని ధ్రువ పరుస్తూ పంచనామా రిపోర్ట్ ఇచ్చారు.
కురుసింగా సోము భార్య జంగుబాయి వారసులు తమ పట్టా భూమి కొలత కోసం చాలన్ కట్టి జిల్లా సర్వే అధికారులతో భూమిని కొల్పించుకున్నారు. సర్వే నెంబర్ 84/2/21 లోని మొత్తం భూమి 2.28 ఎకరాలు ఓరియంట్ ఆధీనంలోనే ఉందని జిల్లా సర్వే అధికారి గంగాధర్ ధ్రువ పరుస్తూ పంచనామ రిపోర్ట్ 9.12.2011 నాడు సోము వారసులకు అందజేశారు. జిల్లా సర్వే అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్ తో హైకోర్టులో పిటిషన్ నెంబర్ 10 956 / 2012 ఓరియంట్ యాజమాన్యంపై కేసు వేశారు. 10 సంవత్సరాల విచారణ అనంతరం ఇటీవల 24 జూన్ 2022 వీరికి అనుకూలంగా పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అమలు చేయించే బాధ్యత జిల్లా కలెక్టర్ కు అప్పచెప్పింది.
కోర్టు తీర్పు పట్టుకొని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని అధికారులు సరిగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం కోసం రెండు దశాబ్దాలుగా ఓరియంట్ యాజమాన్యంతో పోరాడుతున్న ఆదివాసి మహిళ కోవా ఇంద్రుబాయి.
దేవాపూర్ అచ్యుతరావు గూడానికి చెందిన కోవా ఇంద్రు బాయి కి మద్దిమాడ శివారులో తన భర్త కోవ బుజ్జి పేరిట సర్వే నెంబర్ 84 / 136 లో 2.20 ఎకరాల భూమి ఉంది. ఓరియంట్ యాజమాన్యం కర్మాగారం నిర్మాణం కోసం గిరిజన రైతుల నుండి రెవెన్యూ శాఖ ద్వారా భూమిని సేకరించింది. ఆవరణ చుట్టూ గోడ కట్టుకుంది. సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు సున్నపు రాయిని పడమర ప్రాంతంలోని అడవి, గుట్టల నుండి తెచ్చుకుంటుంది. ముడి సరుకును తీసుకువచ్చేందుకు కన్వేయర్ బెల్ట్ వేసుకుంది. కన్వేయర్ బెల్ట్ వేసుకు నే స్థలంలోనే అటవీ భూములతో పాటు ఇంద్రుబాయి మరి కొంత మంది రైతులకు చెందిన భూము లు కోల్పోయారు. వారిలో కొంత మందికి పరిహారము ఉద్యోగాలు ఇచ్చారు .ఇంద్ర బాయ్ కి 2.20 ఎకరాల భూమి కన్వేయర్ బెల్ట్ నిర్మాణంలో కోల్పో యింది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 1.03 ఎకరాలు మాత్రమే పోయిందని వుంది. మిగతా 1.17 ఎకరాలు ఎక్కడ ఉందో తెలియడం లేదు. మొత్తం భూమి ఓరియంట్ ఆధీనంలో ఉందని పరిహారం, ఉద్యోగాలు ఇవ్వలేదని కోవా ఇంద్రుబాయి ఆరోపిస్తోంది.కంపెనీ స్వాధీనం చేసుకున్నా భూమికింద తన కొడుకులు కోవా రాజు, బారిక్ రావు, కాంతారావు లకు ఉద్యోగా లివ్వాలని యాజమాన్యాన్ని గత 20 ఏళ్లుగా కోరుతున్న పట్టించు కోవడం లేదు. యాజ మాన్యం స్వాధీనం చేసుకున్న భూమి పక్కనె మరికొంత భూమి ఉంది. దాన్ని కూడా యాజమాన్యం సాగు చేసుకునివ్వడం లేదని కన్వేయర్ బెల్ట్ వైపు వెళ్ళకుండా పెన్సింగ్ వేసుకున్న దని ఇంద్రుబాయి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కోల్పో యిన భూమికి పరిహారం ఉద్యోగా లు ఇవ్వాలని చాలాసార్లు తన కొడుకులతో వెళ్లి కన్వేయర్ బెల్ట్ నడవకుండా అడ్డగించింది.
జీవనాధారమైన భూమిని కోల్పోయి, పరిహారం కోసం 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోవ మాన్కు వారసులు.
కోవా బాపు రావు కు గంగారాం, లింగు, మానిక్ రావు, చిన్న గంగారాం అనే నలుగురు కుమారులు ఉన్నారు. కోవా సోముకు మాణిక్ రావ్, సుగుణ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కర్మాగా రం నిర్మాణంలో బాపు రావు,సోముకు చెందిన చెరి రెండు ఎకరాలు మొత్తం నాలుగు ఎకరాల భూమిని కోల్పోయారు. రెవెన్యూ యాజమాన్యం ఇచ్చిన అవార్డు సిఫారసు మేరకు ఓరియంట్ యాజమాన్యం నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించి కోల్పోయిన భూమి కింద బాపు రావు పెద్ద కుమారుడు గంగారం కు, సోము ఏకైక కుమారుడు మాణిక్ రావు కు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 12 ఎకరాల భూమికి పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే తమకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులను అడగాలని యాజమాన్యం తప్పించుకుం టుందని కోవా మాన్కు వారసులు వాపోతు న్నారు. మిగతా 12 ఎకరాల భూమి లో వ్యవసాయం చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుని జీవనోపాధి పొందేందుకు బాపురావు వారసులు లింగు, మాణిక్ రావ్, చిన్న గంగారాం లు ఓరియంట్ ఆధీనంలోని భూమి లోకి వెళ్తే మీ భూమి ఇక్కడ లేదు మేము రెవెన్యూ శాఖ ద్వారా కొనుగోలు చేశామని గిరిజనుల భూమి చుట్టూ ఓరియంట్ యాజమాన్యం గోడలు కట్టుకుని లోనికి రానివ్వడం లేదు.
ఓరియంట్ ఆధీనంలోని తమ భూమి వివరాలు తెలుసు కునేందుకు కోవా లింగ్ జిల్లా సర్వే అధికారులతో భూమిని కొల్పించేం దుకు 2000 సంలో చాలన్ కట్టాడు. చాలన్ నెంబర్ 15 248 తేదీ 22. 9.2000 . చాలన్ కట్టిన ఓరియంట్ యాజమాన్యం ఒత్తిడి తో రెవెన్యూ శాఖ, సర్వే అధికారులు కొలిచేందుకు ముందుకు రాలేదు. నిర్వాసిత రైతులంతా హైకోర్టును ఆశ్రయించడం తో రీ సర్వే చేసి నిర్వాసిత ఆదివాసి రైతుల భూములు వివరాలు వెల్లడించాలని కోర్టు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు కోవా లింగు భూమి ని 13. 12.2010 లో కొలిచారు. 12 ఎకరాల భూమి ఓరియంట్ యాజమాన్యం ఆధీనంలోనే ఉన్నట్లు తేలింది. సర్వే పూర్తయి 11 ఏళ్లు గడుస్తున్నా పంచనామ కాఫీలు సర్వే అధికారులు ఇవ్వడం లేదని లింగు వాపోతున్నారు.
జీవనాధారమైన 32 ఎకరాల భూమిని ఓరియంట్ నిర్మాణంలో కోల్పోయి పరిహారం, ఉద్యోగాల కోసం 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మడావి లింగు వారసులు.
దేవాపూర్ గ్రామం చెందిన మడావి లింగుకు కు సోము, జంగు ఇద్దరు కొడుకులు. సర్వే నెంబర్ 84 /55 లో మడావి లింగు తండ్రి పేరు జైతు పేరిట 16 ఎకరాలు, అతని కొడుకులు సోము, జంగుల పేరిట సర్వే నెంబర్ 84/40 లో చెరి 8 ఎకరాలు 16 ఎకరాల పట్టా భూములు ఉండేవి. ఓరియంట్ కర్మాగారం నిర్మాణంలో మడావి లింగు కుటుంబానికి చెందిన మొత్తం 32 ఎకరాల భూమి కోల్పోయారు.
సర్వే నెంబర్ 84 /40 లో కోల్పోయిన 16 ఎకరాల భూమికింద మడావి సోము కు, జంగు కుమారుడు బాదిరావుకు ఓరియంట్ లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 16 ఎకరాలలో 3.13 ఎకరాలు మాత్రమే భూసేకరణలో ఓరియంట్ యజమాన్యం కు రెవెన్యూ అధికారులు అప్పచెప్పి ఆ భూమికి మాత్రమే పరిహారం చెల్లించారు. మిగతా 12.2 7 ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదు. వారి తండ్రి మడావి లింగు తండ్రి పేరు జైతు పేరిట ఉన్న సర్వే నెంబర్ 84 / 55 పేరిట ఉన్న 16 ఎకరాల భూమి మొత్తం భూసేకరణలో పోయి పరిహారం ఉద్యోగాలు ఇవ్వలేదని లింగు కుమారులు సోము, జైతుల వారసులు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం 84/ 55 లోని 16 ఎకరాల భూమిలో 6.03 ఎకరాలు మాత్రం ఓరియంట్ భూసేకరణలో తీసుకుందని ఉంది. మిగతా 9.37 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తేలడం లేదు. తండ్రి లింగు పేరిట ఉన్న భూమి కింద నిరుద్యోగులుగా ఉన్న తమ కుమారులు రఘు, లింగు లకు ఉద్యోగాలు ఇవ్వాలని సోము కోరుతున్నారు. ఓరియంట్ నిర్మాణంలో తాము కోల్పోయిన 32 ఎకరాల భూమిలో 22 ఎకరాల భూమికి పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని సోము,జైతులు ఓరియంట్ యాజమాన్యం పై గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఓరియంట్ యాజమాన్యం మీ భూములు మా స్వాధీనంలో లేవు, రెవెన్యూ అధికారులు ద్వారా సేకరించిన భూమిని మాత్రమే తమ వద్ద ఉందాని వారు సూచించిన వారికి ఉద్యోగాలు, పరిహారం చెల్లించాము కాబట్టి తమకు సంబంధం లేదని తప్పించుకుంటుంది. మరోవైపు తమకున్న 32 ఎకరాల భూమిలో 30,40 ఏళ్లుగా ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పడేవరకు 1980 సంవత్సరం వరకు భూముల్లో వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని హాయిగా బ్రతకమని అమాయకఆదివాసి కుటుంబాలు చెబుతున్నాయి. ఒకే సర్వే నెంబర్ల పై ఉన్న 32 ఎకరాల లో 10 ఎకరాల భూమి మీ ఆధీనం లో ఉండి మిగతా భూమి ఎటు పోతుందని మడావి సోము,జంగు వారసులు ప్రశ్నిస్తున్నారు.
తాము కోల్పోయిన భూమికి పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని గత 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు నాయకులు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు. చివరకు 2008లో తమ పట్టా భూములు ఎక్కడ ఉన్నాయో తేల్చాలని సోము,జంగు వారసులు జిల్లా సర్వేఅధికారులను సంప్రదించారు. ఓరియంట్ భూసేకరణలో పోగా మిగిలిన సర్వే నెంబర్ 84/40 లో ని 12.27 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపాలని వారు జిల్లా సర్వే అధికారులకు రూ.360 చెల్లించి చాలన్ కట్టారు. చాలన్ నెంబర్ 15853 తేదీ 19.9.2008 లో కట్టారు. తమ తండ్రి మడావి లింగు పేరిట ఉన్న సర్వే నెంబర్ 84 /55 లోని 16 ఏకరాలలో ఓరియంట్ భూసేకరణలో పోగా మిగిలిన 9.37 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపాలని చాలన్ కట్టారు. చాలాన్ నంబర్ 23191 తేదీ 20. 12. 2008 లో కట్టారు. కొలిచేందుకు సర్వే అధికారులు నిర్లక్ష్యం చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2010లో జిల్లా సర్వే అధికారులు ఓరియంట్ ఆధీనంలోని భూములను కొలిచారు. వీరి మొత్తం భూమి 32 ఎకరాల ఓరియంట్ ఆధీనంలోనే ఉందని తేలిందని సోము జంగు వారసులు తెలుపుతున్నారు. కొలిచిన భూములకు సంబంధించిన పంచనామా కాపీ నివ్వాలని పన్నెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ జరిగిన ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులు 43 ఏళ్లుగా తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి తమ భూములకు పరిహారంతో పాటు తమ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు.











