మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఈ నెల 9 నుండి 11 వరకు కూపర్ లింగు స్వామి జాతర.

 కూపర్ లింగు స్వామి  జాతర నిర్వహణపై గిరిజన సంఘాల సమావేశం.


 కూపర్లింగు స్వామి జాతరపై గిరిజన సంఘాల సమావేశం.

Scv News Kasipet :--

కాసిపేట్ మండలం లోని వెంకటాపూర్ పంచాయితీలోని  కుర్రేఘడ్ గ్రామం లో జై శ్రీ  పాహుండి కుపార్ లింగు స్వామి జాతర నిర్వహణపై ఈరోజు మండలంలోని వివిధ గిరిజన సంఘాల నాయకులు సమావేశమయ్యారు.  ఆలయ గురు స్వామి శ్రీ కుర్శింగా భూదేశావ్ స్వామి  అద్యక్షత సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లపై చర్చించారు.

 జాతరను ఈ నెల 9 నుండి 11 వ తేదీలలో నిర్వహించాలని నిర్ణయించారు.

 9వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి భజన కార్యక్రమం ప్రారంభమై, పదవ తేదీ శనివారం ఉదయం రెండు గంటల నుండి సాయంత్రం వరకు అగ్నిగుండం, 6 గంటలకు మాల విరమణ 11వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు దర్బారు రెండు గంటలకు పెద్ద పూజ జరిపి జాతర ముగించాలని నిర్ణయించారు.

జాతర నిర్వహణ కమిటీ ఏర్పాటు.

గౌరవ అధ్యక్షులు: అడే జoగు

ఉపాధ్యక్షులు:  వల్క శ్రీను,అత్రం అమృత్ రావ్. మడవి గంగారాం. సిడం రాందాస్.

జనరల్ సెక్రెటరీ:  అడే తిరుపతి

కోశాధికారి:  పంద్రం సింగు

కార్యదర్శులు:  కనక రాజు. మడవి వెంకటేష్. కుర్శింగ నాగేశ్వర రావు.

ప్రచార కార్యదర్శి: ఆత్రం మహేష్. సిడం భరిక్ రావ్. ఉయిక మోతిరం. 

సాంస్కృతిక కార్యదర్శి:

వల్క శంకర్. కూర్సింగ తిరుపతి. సురేందర్.

సలహా దారులు: తేకం భీము. సిడం సోము. కుడ్మేత ఈశ్రు. కుంరం భీము. కోముల భాపు. సండ్ర భుమన్న. కుడ్మేత పెంటు. కోవ వినోద్. కుడ్మేత మారు లను ఎన్నుకున్నారు  ఈ సమావేశంలో 

మండలం లోని వివిధ గిరిజన గూడాల నుండి  గ్రామ పట్టెళ్లు, పెద్దలు, అన్నీ ఆదివాసి కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు , ప్రజాప్రతి నిధులు, యువత, మహిళలు. స్వాములు హాజరయ్యారు.

    


 


*