ఆదివాసీల సంప్రదాయాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.
- సత్యపాల్ రావు ఓరియంట్ సిమెంట్ కార్మిక నాయకుడు .
![]() |
| కూపర్లింగు స్వామి జాతర దర్బార్ లో మాట్లాడుతున్న సత్యపాల్ రావు. |
Scv News Kasipet:--
సమాజంలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆదివాసీలు సంప్రదాయాలను కాపాడుకుంటూ నే, పిల్లలను ఉన్నతంగా చదివించి ఆర్థిక అభవృద్ధి సాధించే విధంగా జాతి పెద్దలు అందరూ కృషి చేయాలని ఓరియెంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యాపాల్ రావు (చిట్టిబాబు) అన్నారు. ఈరోజు కాసిపేట మండలంలోని వెంకటపుర్ గ్రామంలోని కుర్రెఘడ్ లోని పాహుండి కుపర్ లింగు స్వామి జాతరకు ముఖ్య అతిధులుగా హాజరై భక్తులనుదేశించి మాట్లాడారు. అంతకు ముందు జాతర నిర్వహణ కమిటీ సభ్యులు డప్పు డోలు వాయిద్యాల నడుమ సత్యపాల్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారులో పాల్గొని ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులను మంజూరు చేసేలా కృషి చేయాలని కమిటీ సభ్యులు కోరగా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు . వీటితో పాటు తమ నాన్న గారి కోక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహాయసహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామం నిర్మాణం అయింది అంటే మా నాన్న గారి కృషి ఉందని గుర్తు చేశారు. తమ సోదరుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో మాట్లాడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు వేముల కృష్ణ మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కుంటూ, జాతర ఏటా ఏటా అభివృధి చేసుకోవాలని ఆలయ కమిటీకి సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ, ఆదివాసి నాయకులు మడావి వెంకటేష్, కనక రాజు, జనార్థన్, తుడుందేబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగు, ఎంపీటీసీ పార్వతి మల్లేష్, మెరుగు శంకర్, సిడం గణపతి, ప్రభాకర్, మడవి వెంకటేష్, అన్నం కుమార్, రషీద్,ఖలీమ్,కదిర్,పెద్దిరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కనుకుల రాకేష్, ప్రధాన కార్యదర్శి జంగిళి రమేష్,మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, యూత్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ప్రచార కార్యదర్శి దుర్గం గణేష్, NSUI నాయకులు వంశీ, విద్యాసాగర్, విద్యాసాగర్,రమేష్, షకిల్,చారీ, తదితరులు పాల్గొన్నారు.

