కూపర్లింగు స్వామి జాతర పోస్టర్లను జిల్లా కేంద్రంలో విడుదల.
![]() |
| కూపర్లింగు స్వామి జాతర పోస్టర్ను జిల్లా కేంద్రంలో విడుదల చేస్తున్న జాతర నిర్వహణ కమిటీ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం, కుర్రేఘడ్ గ్రామంలో ఫిబ్రవరి 9.10.11 న గోండి ధర్మ గురు శ్రీ శ్రీ శ్రీ పాహుండీ కుపార్ లింగు స్వామి జాతర సందర్భంగా ప్రచార నిమిత్తం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో కరపత్రాలను పోస్టర్లను జాతర నిర్వహణ కమిటీ ఈరోజు విడుదల చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ లో బెల్లంపల్లి RDO, DTDO, చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందని నిర్వహణ కమిటీ తెలిపింది .
ఈ కార్యక్రమం లో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి సోయం జoగు, జాతర కార్యనిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు అత్రం అమృత్ రావు. మడవి గంగారాం, సిడం రామ్ దాస్, కోశాధికారి పంద్రం సింగు, కార్యదర్శి మడవి వెంకటేష్, సాంస్కృతిక కార్యదర్శి కుర్శింగ తిరుపతి, సలహా దారులు సండ్ర భుమన్న. పేందుర్ ప్రభాకర్, మడవి ప్రకాష్ పాల్గొన్నారు

